Tuesday, September 17, 2024

జాబ్ క్యాలండర్ విడుదల.. పరీక్షల షెడ్యూల్ ఇదే

- Advertisement -
- Advertisement -

గ్రూప్-1 పరీక్షలు అక్టోబర్‌లో, గ్రూప్-2 డిసెంబర్‌లో, గ్రూప్-3 నవంబర్‌లో…
టాన్స్‌కోలో వివిధ ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం అక్టోబర్‌లో నోటిఫికేషన్,
వచ్చే ఏడాది జనవరిలో నియామక పరీక్షలు
వివిధ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వచ్చే ఏడాది జూలైలో…
సింగరేణిలో పలు ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జూలైలో నోటిఫికేషన్….
అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలండర్‌ను విడుదల చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
మనతెలంగాణ/హైదరాబాద్: జాబ్ క్యాలండర్ గురించి ముందే ప్రకటించామని, అందులో భాగంగానే దానిని అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. అసెంబ్లీలో శుక్రవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రశ్నాపత్రాల లీక్, పరీక్షలు వాయిదా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేశామని, నిరుద్యోగ యువతీ, యువకుల ఆశలు నెరవేర్చేందుకు ఈ జాబ్ క్యాలండర్ అని ఆయన పేర్కొన్నారు. ఆ విధంగానే సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జాబ్ క్యాలండర్‌ను విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు.

గత ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాల ప్రకటనలు, రద్దు కావడం, వాయిదా వేయడం, ప్రశ్నాపత్రాల లీక్, పరీక్షల తేదీలు ఓవర్ లాప్‌తో ఇబ్బందులు పడ్డారన్నారు. గత ప్రభుత్వ పాలనలో గ్రూప్ 1 పరీక్ష రెండుసార్లు రద్దు అయ్యిందన్నారు. 2023 సంవత్సరం మార్చి 17వ తేదీన పేపర్ లీక్, 2024 ఫిబ్రవరి 19వ తేదీన అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకపోవడంతో హైకోర్టు తీర్పు మూలంగా రద్దు అయ్యిందన్నారు.

గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నియామక నోటిఫికేషన్‌లలో జాప్యం, తరచూ వాయిదాలు ఇబ్బందికరంగా మారాయని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వ పాలనలో నియామక ప్రక్రియ గందరగోళంగా మారిందన్నారు. వారి హయాంలో గతంలో రెండుసార్లు గ్రూప్-1 పరీక్ష రద్దయ్యిందని ఆయన గుర్తు చేశారు. తాము అధికారంలోకి రాగానే పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నాలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు.

గ్రూప్ 1 నోటిఫికేషన్‌లో అదనంగా 60 పోస్టులు
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు యూపిఎస్సీ కమిషన్ చైర్మన్‌ను సంప్రదించారని, యూపీఎస్సీ, కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేయించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గ్రూప్ 1 నోటిఫికేషన్‌లో అదనంగా 60 పోస్టులు జోడించి 563 ఖాళీల కోసం కొత్తగా నోటిఫికేషన్ జారీ చేశామని ఆయన తెలిపారు.

ఫలితాలు ప్రకటించామని, ఈ ఏడాది అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మెయిన్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేశామని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే 32,410 మంది నిరుద్యోగ యువతకు నియామక ఉత్తర్వులు జారీ చేశామని, అదనంగా 13,505 ఉద్యోగాల నియామకం చివరి దశకు చేరుకుందన్నారు. 11,022 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశామని, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల మధ్య తగిన సమయం లేకపోవడంతో నిరుద్యోగుల కోరిక మేరకు ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలు నిరుద్యోగుల కోరిక మేరకు డిసెంబర్‌కు వాయిదా వేశామని ఆయన తెలిపారు. కేబినెట్ సమావేశంలో జాబ్ క్యాలండర్ గురించి చర్చించి ఆమోదించామని, 2024, 25 సంవత్సరానికి సంబంధించి జాబ్ క్యాలండర్‌ను సభ్యులకు అందచేశామని ఆయన పేర్కొన్నారు.

ఉద్యోగం పేరు/శాఖ నోటిఫికేషన్ తేదీ పరీక్షలు నిర్వహించే తేదీ
గ్రూప్-1 పరీక్షలు ఫిబ్రవరి 2024 అక్టోబర్ 21 నుంచి 27ల మధ్య
గ్రూప్-3 డిసెంబర్ 2022 నవంబర్ 17 నుంచి 18ల మధ్య
గ్రూప్-2 డిసెంబర్ 2022 డిసెంబర్ 2024లో
వైద్య,ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ సెప్టెంబర్ 2024 నవంబర్ 2024లో
ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్
ట్రాన్స్‌కోలో వివిధ ఇంజనీరింగ్ అక్టోబర్ 2024లో జనవరి 2025లో
ఉద్యోగాల కోసం
టెట్ నోటిఫికేషన్ నవంబర్ 2024లో జనవరి 2025లో
వివిధ శాఖల్లో గెజిటెడ్ జనవరి 2025లో ఏప్రిల్ 2025లో
ఉద్యోగాల కోసం
డిఎస్సీ నోటిఫికేషన్ ఫిబ్రవరి 2025లో ఏప్రిల్ 2025లో
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఫిబ్రవరి 2025లో మే 2025లో
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరి 2025లో జూలై 2025లో
ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఏప్రిల్ 2025లో ఆగష్టు 2025లో
ఉద్యోగాలు
డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులు, జూన్ 2025లో సెప్టెంబర్ 2025లో
ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు
మరోసారి గ్రూపు 2 నోటిఫికేషన్ మే 2025లో అక్టోబర్ 2025లో
గ్రూప్-3 నోటిఫికేషన్ జూలై 2025లో నవంబర్ 2025లో
సింగరేణిలో పలు ఉద్యోగాల కోసం జూలై 2025లో నవంబర్ 2025లో

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News