ఖమ్మం: రైతు భరోసా పథకం అమలు కోసం ఉమ్మడి పది జిల్లాల రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఖమ్మంలో జరిగిన రైతు భరోసా ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో భట్టి ప్రసంగించారు. రైతు భరోసా విధానాలు రూపొందించిన తరువాత రైతులకు సాయం చేయస్తామన్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశం పెట్టలేదని, దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టిందని వివరించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని భట్టి స్పష్టం చేశారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, రైతులకు రుణమాఫీ కూడా చేస్తామని భట్టి చెప్పారు. ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో రైతు భరోసా పథకం పై ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులతో విస్తృత సాయి సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వ్యవసాయ రంగాన్ని కాపాడుకుంటాం: భట్టి
- Advertisement -
- Advertisement -
- Advertisement -