Sunday, January 19, 2025

ఈ ఎన్నికల్లో బిజెపిని బొంద పెట్టాలి: భట్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి దేశానికి అత్యంత ప్రమాదకరమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. బిజెపికి ఓటేస్తే దేశానికి భవిష్యత్ ఉండదన్నారు. రిజర్వేషన్లు ఎత్తేసేందుకు బిజెపి కుట్ర చేస్తోందని, రాజ్యాంగాన్ని మార్చేందుకు కూడా కుట్ర పన్నుతోందని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లు ఎత్తేసేందుకు బిజెపి 400 సీట్లు అడుతోందని, రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లు ఎత్తేస్తారా? అని ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే రిజర్వేషన్ల కుట్ర ఆగుతుందని స్పష్టం చేశారు.  రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పెద్దలు అమలు చేస్తూ వచ్చారని, పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని బొంద పెట్టాల్సిందేనని, కేంద్రంలోకి కాంగ్రెస్ పవర్‌లోకి రాగానే జనగణన చేస్తుందన్నారు. పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని భట్టి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుస్తుందన్నారు. ప్రజల హక్కులను బిజెపి తొక్కి పెట్టాలని చూస్తోందని ధ్వజమెత్తారు. మతం పేరుతో రాజకీయం చేసే బిజెపిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడితే బెదిరింపులకు దిగుతున్నారని భట్టి మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News