Tuesday, January 14, 2025

హరీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు: భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాటలతో అంకెల గారడితో బిఆర్‌ఎస్ గత పదేళ్ల నుంచి మోసం చేసిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌ను రూపొందించామని, బిఆర్‌ఎస్ నేతలు ప్రజలకు భ్రమలు కల్పిస్తన్నారని దుయ్యబట్టారు. శాసన సభలో బడ్జెట్ పద్దుపై చర్చ సందర్భంగా హరీష్ రావు కామెంట్స్ కు భట్టి రీకౌంటర్ ఇచ్చారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, మా బడ్జెట్‌ను చూసిన తరువాత హరీష్‌రావు కంటగింపుగా మారిందని చురకలంటించారు. టానిక్ లాంటి షాపులు పెట్టి సర్కార్‌కి డబ్బులు రాకుండా చేశారని, కొన్ని కుటుంబాలకు వెళ్లేలా గత సర్కార్ చేసిందని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News