Sunday, December 22, 2024

గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లకు కూడా పట్టాలు ఇస్తున్నాం: భట్టి

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం భద్రాద్రి: సొంతింటి కల సాకారం కోసం పదేళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్నారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్ పర్యటిస్తున్నారు. భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లు మోడల్‌ను సిఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భట్టి ప్రసంగించారు. మరో కీలక పథకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించామని, గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లకు కూడా పట్టాలు ఇస్తున్నామని, గత ప్రభుత్వం పదేళ్లలో పేదవాడికి సొంతిల్లు ఇవ్వలేకపోయిందని భట్టి దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల బాధలు చూసే ఆరు గ్యారంటీలు ప్రకటించామని, ఇచ్చిన హామీలను 90 రోజుల్లోగా అమలు చేస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అందిస్తున్నామని భట్టి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News