Thursday, January 16, 2025

ఈ ఎన్నికలు దొరల తెలంగాణ- ప్రజల తెలంగాణ మధ్య పోరు: భట్టి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి పదేళ్లు అయినా అభివృద్ధి లేదని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు.ఖమ్మం కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ధనిక రాష్ట్రంలో తెలంగాణ ఇస్తే పాలకులు దోచుకుతిన్నారని, ఈ ఎన్నికలు దొరల తెలంగాణ- ప్రజల తెలంగాణ మధ్య పోరు అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని వివరించారు. తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని, సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల వరకు సాయం చేస్తామని, అగ్నిప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని భట్టి డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సూచించారు. అగ్ని ప్రమాదంపై విచారణ సమగ్రంగా జరగాలన్నారు. ఖమ్మంలో పది అసెంబ్లీ స్థానాలకు పదింటిలో కాంగ్రెస్, సిపిఐ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News