Tuesday, January 21, 2025

రుణమాఫీని వందరోజుల్లో చేస్తామనలేదు: భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రుణమాఫీని వంద రోజుల్లో చేస్తామనలేదని, కానీ, రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని, త్వరలోనే రుణమాఫీ చేస్తామని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆర్థిక వెసులుబాటు చూసుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ‘విద్యుత్- త్రాగునీరు- ఆర్థికం’ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసిన ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని భట్టి ధీమా వ్యక్తం చేశారు.

తాము అధికారం దిగిపోయే నాటికి ఖజానాలో రూ.7 వేల కోట్లు బ్యాలన్స్ ఉందని బిఆర్‌ఎస్ చెబుతోందని కానీ, నిజానికి మేం ప్రమాణ స్వీకారం చేసిన రోజు రాష్ట్ర ఖజానా రూ.3,960 కోట్లు మైనస్‌లో ఉందని ఆరోపించారు. రూ.7 వేల కోట్లు ఎవరి అకౌంట్‌లోకి పోయాయని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. సాగునీరు, విద్యుత్ పై ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ఆరోపణలను ప్రజలు నమ్మే ప్రమాదం కూడా ఉందని, ప్రజలను ఆందోళనలోకి నెట్టే ప్రచారం మంచిది కాదని ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News