Sunday, December 22, 2024

మూసీ నిర్వాసితులకు అద్భుత టవర్స్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మూసీ నిర్వాసితులకు అక్కడే అద్భుతమైన టవర్లు నిర్మిస్తామని, వారు సకల సౌకర్యాలతో ఉండేలా ఏర్పాట్లు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. మూసీ నిర్వాసితు ల పిల్లలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తామని, 30 వేల ఎకరాలలో అద్భుతమన ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామని చెప్పారు. 30 వేల ఎకరాల్లో 15 వేల ఎకరాలు గ్రీన్ బెల్ట్ గా ఉంటుందన్నారు. రియల్టర్ల సమస్యలు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి, హైడ్రా పై కావాలనే కుట్రపూరితం గా విష ప్రచారం చేస్తున్నారని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లో శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న భట్టి  మాట్లాడుతూ గోదావరి, కృష్ణ, మంజీరా నుంచి హైదరాబాద్ కు తాగునీరు అందిస్తున్నామని, డ్రైనేజీల ట్రీట్ మెంట్ కు 39 ఎస్టీపీలు మంజూరు చేశామన్నారు. మూసీ నిర్వాసితులకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలన్న ఆలోచనలతో సీఎం, రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.

భారతదేశంలో భవిష్యత్తు హైదరాబాద్ అని, మూసి పునర్జీవనం, ఆర్‌ఆర్‌ఆర్, 30 వేల ఎకరాల్లో అద్భుతమైన ఫ్యూచర్ సిటీనీ నిర్మిస్తున్నామన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కారణంగా రిజిస్ట్రేషన్లలో స్తబ్దత ఏర్పడిందని, ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయన్నారు. రియల్టర్ల సమస్యలు వినడానికి రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో ఉందని, వినడానికి, చర్చించడానికి సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్ మనది, మన అందరిది దేశానికి తలమానికం, గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న నగరం అని అన్నారు. హైదరాబాదును పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి, సంకల్పంతో ప్రభుత్వం ఉందని,అందరినీ అక్కున చేర్చుకునే నగరం హైదరాబాద్ అని తెలిపారు. నాటి పాలకులు బిహెచ్‌ఇఎల్, హెచ్‌ఈల్, సీసీఎంబీ వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేశారని, ఫలితంగా వారి నివాసం కోసం కూకట్‌పల్లి, వెంగళరావు నగర్, బర్కత్‌పురా వంటి హౌసింగ్ బోర్డులు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి పదివేల కోట్లు కేటాయించామని, ఇది క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ మాత్రమే అన్నారు.

ఈ నిధులతో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, డ్రైనేజీలు అన్ని సౌకర్యాలు కల్పించి ప్రపంచవ్యాప్తంగా రియల్టర్లను ఆకర్షిస్తామన్నారు. మంచినీటి ఎద్దడి లేకుండా గోదావరి, కృష్ణ ,మంజీరా నదుల నుంచి తాగునీరు అందిస్తున్నామని, హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక మణిహారంలా వెలుగొందుతుందన్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు, జేఎన్‌టియు, ఐఐఐటి వంటి ప్రతిష్టాత్మమైన సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయని తెలిపారు.వాటిని భవిష్యత్ తరాలకు మరింత ఉన్నతంగా అందించాలని ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. నిర్వాసితులైన డ్వాక్రా మహిళలకు రూ. 1000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధిని కల్పిస్తామన్నారు. హైడ్రా అనుమతులు ఇవ్వదని, హైడ్రా పై కుట్రపూరితంగా విష ప్రచారం చేస్తున్నారని, జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ, డిటిసి వంటి ప్రభుత్వ సంస్థలు అనుమతులు ఇస్తాన్నారు .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News