Thursday, January 23, 2025

జగన్‌పై దాడిని ఖండించిన భట్టి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై దాడిని తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠినం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సిఎం జగన్‌పై హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం క్షణ్ణంగా పరిశీలించింది. ఘటనా స్థలంలో సిసి ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ లో వివేకానంద స్కూల్, గంగానమ్మ గుడి మధ్య నుంచి దాడి జరిగినట్టు ప్రాథమికంగా పోలీసులు నిర్థారించారు. 20 అడుగుల దూరం నుంచి ఆగంతకుడు దాడి చేసినట్టు గుర్తించారు. స్కూల్ నుంచి గురి చూసి పదునైన వస్తువుతో సిఎం జగన్‌పై దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు. దుండగులను త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News