Monday, March 31, 2025

మధిర ప్రజలు తలవంచే పని చేయను: భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

మధిర: తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నేతలు ప్రచారాలతో దూకుడు పెంచారు. ఖమ్మంజిల్లా మధిరలో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆదివారం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. బిఆర్ఎస్ పాలనతో ప్రజల సంపదను దొరలు పంచుకుతిన్నారని భట్టి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ. లక్ష కోట్లు అవినీతి జరిగిందని ఆయన విమర్శించారు. ఉచిత కరెంట్ పథకం ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని భట్టి వెల్లడించారు. 6 గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని ఆయన తెలిపారు. మధిర ప్రజలు తలవంచే పని ఎప్పుడు చేయనని ఆయన పేర్కొన్నారు. మధిర నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపేందుకు అన్ని రకాల కృషి చేస్తానన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News