Monday, March 31, 2025

భూభారతితో ఎన్నికలకు వెళ్తాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: భూ భారతిపై అసెంబ్లీలో మాటల యుద్ధం కొనసాగింది. ధరణి, భూ భారతి అం శంపై కాంగ్రెస్, బిఆర్‌ఎస్ శాసనసభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భా గంగా బుధవారం సభలో ధరణి , భూ భారతి పై చర్చ ఆ సక్తికరంగా కొనసాగింది. అధికార, విపక్ష నేతల పరస్పర ఆరోపణలతో సభ దద్దరిల్లింది. బుధవారం శాసనసభలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క కలంపోటుతో భూమిపై హక్కులు లేకుండా చేసిన చట్టం ధరణి అని, ఆ చట్టాన్ని బంగాళాఖాతంలో వే స్తామని చెప్పి అలానే చేశామని సభలో స్పష్టం చేశారు. వ చ్చే ఎన్నికల్లో ధరణిని అజెండాగా తీసుకుని ముందుకు వె ళ్తూనే భూభారతి కాన్సెప్ట్‌తో ప్రజల్లోకి వెళ్తామని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ధరణి’ బాగుం దో..లేదో అన్న విషయంపై ఇప్పటికే ఇటీవల జరిగిన ఎన్నికల్లో పూర్తి స్పష్టత వచ్చిందన్నారు. ధరణిలో జరిగిన అక్రమాలు, అన్యాయాలను పల్లా రాజేశ్వర్ రెడ్డి కప్పిపు చ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారన్నారు. వీఆర్‌ఏ, వీఆర్వోలపై గత సర్కార్ ఎలా ప్రేమ చూపించిందో అందరికీ తెలుసని, కొ త్తగా వాళ్ల భవిష్యత్తు, అభ్యున్నతిపై బీఆర్‌ఎస్ పార్టీ మా ట్లాడటం హస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. వీఆర్‌ఏలు కావాలని ప్రజలే అడుగుతున్నారని, ఆ వ్యవస్థను మళ్లీ త్వరలోనే తీసుకురాబోతున్నామని తెలిపారు. ఈ వి షయంలో బిఆర్‌ఎస్ నేతలు కట్టుకథలు చెబుతున్నారని అ న్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో వీఆర్‌ఏ, వీఆర్వోలకు ప్రత్యేక గౌరవం ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.

ధరణి ఓ దుర్మార్గమైన చట్టం : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
సాయుధ పోరాట స్ఫూర్తితోనే కాంగ్రెస్ భూములపై హక్కులు కల్పిస్తూ వస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. దున్నే వాడిదే భూమి కదా..సాయుధ పోరాట నినాదమని విపక్ష సభ్యులను ప్రశ్నించారు. ఒక్క కలం పోటుతో భూమిపై హక్కులు లేకుండా చేసిన దుర్మార్గమైన చట్టమే ధరణి అంటూ మండిపడ్డారు. అందుకే ధరణిని బంగాళాఖాతం లో వేస్తామని చెప్పామని అన్నారు. అనేక చట్టాలు, పోరాటాల ద్వారా వచ్చిన హక్కులను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాలరాసిందని కామెంట్ చేశారు. ధరణిని బంగాళాఖాతంలో వేయాలనే ప్రజలు మాకు అధికారాన్ని కట్టబెట్టారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News