Thursday, January 9, 2025

బిఆర్‌ఎస్ భూబాగోతాన్ని వెలికితీస్తాం

- Advertisement -
- Advertisement -

ధరణిని అడ్డంపెట్టుకొని వేలాది ఎకరాలు కబ్జా చేసిన గులాబీ నేతలు కాంగ్రెస్ పంచిన 26లక్షల ఎకరాల అసైన్డ్ భూముల
లెక్కలు తీస్తున్నాం ఎన్‌డిఎ కౌంట్‌డౌన్ ఆరంభమైంది ఇందిరమ్మ ఇళ్లపై త్వరలో విధివిధానాలు ఖరారు రూ.2లక్షలలోపు
ఆదాయం ఉన్న వారికి రేషన్‌కార్డులు మీడియాతో చిట్‌చాట్‌లో డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ హయాంలో పంచిన 26 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల వివరా లు సేకరిస్తున్నామని, ధరణి వచ్చిన తర్వాత గత ప్ర భుత్వంలో వేల ఎకరాల అసెన్డ్ భూములు అన్యాక్రాం తం అయ్యాయని వాటి గురించి ప్రస్తుతం ఆరాతీస్తున్నామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. వాటిని తిరిగి అర్హులైన పేదలకు పంచుతామని ఆయ న పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పాత్ర నిర్మాణాత్మకంగా ఉండాలని ఆయన సూ చించారు. ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం కూడా ఉం డాలన్నదే తమ ప్రభుత్వం అభిమతమని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందని, బిజెపి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయ్యిందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. తాము బిఆర్‌ఎస్ ఎ మ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి రావాలని ప్రోత్సహించడం లేదని, వారు అక్కడ ఇమడలేక గ్రూపులుగా మారి ఆ పార్టీని వీడుతున్నారని, కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని ఆయన తెలిపారు. హైదరాబా ద్ అభివృద్ధికి పదివేల కోట్లు కేటాయించామని త్వరలోనే పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాలు ఉంటాయని ఆ యన పేర్కొన్నారు.

బుధవారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా పలు విషయాలను వెల్లడించారు. కేరళలో, జార్ఖండ్‌లలో మం చి మెజారిటీతో గెలిచామని మహారాష్ట్రలో కూడా పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచిందన్నారు. కేరళ వయనాడ్లో అత్యధిక మెజారిటీతో ప్రియాంక గాంధీ గెలిచారని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూ డాలని అనుకుంటున్నామని ఆయన అన్నారు. స్థానిక ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని త్వరలో దీనికి సంబంధించి సిఎం రేవంత్, పిసిసి అధ్యక్షుడు భేటీ అవుతారని ఆయన చెప్పారు. ప్రతినెల ఆర్టీసికి రూ.400 కోట్లను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, గ్యాస్ రూ.500లకే ఇస్తున్నామని ఆయన తెలిపారు. రైతు భరోసాపై కసరత్తు జరుగుతోందని, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా త్వరలో విధి, విధానాలు ప్రిపేర్ అవుతున్నాయన్నారు. 2 లక్షల లోపల ఆదాయం ఉన్నవాళ్లకు త్వరలో రేషన్ కార్డులు ఇవ్వనున్నట్టు డిప్యూటీ సిఎం పేర్కొన్నారు.

మూడు నెలల్లో రూ.18 వేల కోట్లు
ఇన్నాళ్లు రేషన్ కార్డులు ఇవ్వకుండా ఇంట్లో పడుకొని ఇప్పుడు దానిపై కొందరు హడావుడి చేస్తున్నారని డిప్యూటీ సిఎం భట్టి మండిపడ్డారు. చిత్తశుద్ధి లేకుండా ఇన్నాళ్లు రాష్ట్రాన్ని పాలించి ఇప్పుడు హడావుడి చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి చేస్తామని చెప్పి దానిని అలాగే వదిలేసి రైతులను ఇబ్బంది పెట్టారన్నారు. తాము అధికారంలోకి రాగానే రూ.18 వేల కోట్లను మూడు నెలల్లో ఇచ్చా మన్నారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అందరికీ అన్ని అవకాశాలు సమానంగా ఇవ్వాలని కులగణన చేసి రిజర్వేషన్ అందేలా చూస్తున్నా మన్నారు. కులగణన పూర్తి అయ్యాక చర్చ పెడతామని ఎంత శాతం అన్నది క్లారిటీ వస్తుందన్నారు. రాహుల్ గాంధీ చెప్పినట్టు ఇక్కడ ఫలితాలు చూసిన తరువాత దేశ వ్యాప్తంగా అమలుకు డిమాండ్ చేస్తామన్నారు.

కెటిఆర్ ఏమీ మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు
కెటిఆర్ కొన్నిరోజులుగా ఏమీ మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని డిప్యూటీ సిఎం అన్నారు. కెటిఆర్ మైండ్ సెట్ అర్థం అవుతుందని, ఇంకా బూర్జువా, భూస్వామ్య వ్యవస్థ లక్షణాలు పోలేదని ఆయన ఆరోపించారు. ఐఏఎస్ అధికారులు అంటే కూడా బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో గౌరవం లేదని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వంపైనా కెటిఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము గేట్లు అన్ని బార్లా తెరిచి భావప్రకటన స్వేచ్ఛను ఇచ్చి అందరూ మాట్లాడుకునే విధంగా స్వేచ్ఛ ఇచ్చామన్నారు. గత ప్రభుత్వంలో ఇంటికి ఒక ఉద్యోగం, మూడు ఎకరాల భూమి ఇస్తామని ఏమి చెయ్యకుండా ఇప్పుడు అన్ని మాట్లాడితే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. కనీసం గ్రూప్1 పరీక్షను కూడా వారు నిర్వహించలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు తమ ప్రభుత్వంలో 57 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని, జాబ్ క్యాలండర్ విడుదల చేశామని ఆయన తెలిపారు. అప్పుల బారిన పడేయడం తప్ప వారు ఏమీ చెయ్యలేదని ఆయన విమర్శించారు.

నాణ్యతతో కూడిన భోజనం అందించాలని….
సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఇటీవల చోటు చేసుకుంటున్న సంఘటనలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, ఉన్నత అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వసతి గృహాల్లో, రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని, పరిశుభ్ర వాతావరణ, నాణ్యతతో కూడిన భోజనం అందుతుందా లేదా అన్న విషయాలను పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు ఆయన వివరించారు. విద్యార్థుల చదువుల అంశంలో ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని, ఫుడ్ పాయిజనింగ్ దురదృష్టవశాత్తు జరిగిందన్నారు. ఇప్పటికే హైజెనిక్ ఫుడ్, న్యూట్రీషియన్ ఫుడ్స్ అందించాలని అధికారులను ఆదేశించామన్నారు. నాణ్యతతో కూడిన పౌష్టిక ఆహారం అందించేందుకు 40 శాతం మెస్ చార్జీలు పెంచినట్టు ఆయన తెలిపారు.

కాంగ్రెస్‌లో ప్రతి మంత్రి పని మంతుడే
కాంగ్రెస్‌లో ప్రతి మంత్రి పని మంతుడే అని ఆయన చెప్పారు. వాళ్ల లాగే ఉన్నామని కెటిఆర్ అనుకుంటున్నారని డిప్యూటీ సిఎం ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఫిరాయింపులను స్వతహాగా ప్రోత్సహించడం లేదని ఆయన స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ మీద పార్టీ నిర్ణయం తీసుకుంటుందని, నిన్న జరిగిన ఢిల్లీ పర్యటనలో కేబినెట్ విస్తరణ మీద చర్చ జరగలేదని ఆయన వెల్లడించారు. మూసీ బాధితులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News