Thursday, January 2, 2025

భట్టి అధికారిక నివాసంగా ప్రజాభవన్

- Advertisement -
- Advertisement -

డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క
అధికారిక నివాసం ప్రజాభవన్
ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ శాంతికుమారి

డిప్యూటీ సిఎంకు కేటాయిస్తూ
ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్
శాంతికుమారి మొన్నటిదాకా
ఇది మాజీ సిఎం కెసిఆర్
అధికారిక నివాసం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర డిప్యూటీ సిఎం, ఆర్థ్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజా భవన్‌ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. బుధవారం సంబంధించిన ఉత్తర్వులు సిఎస్ శాంతికుమారి జారీ చేశారు.గురువారం మధ్యాహ్నం కుటుంబసమేతంగా భట్టి ప్రజాభవన్‌లోకి అడుగుపెట్టనున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ర్పడిన నాటి నుంచి ప్రగతిభవన్‌ను మహాత్మా జ్యోతిరావు పూలే భవన్‌గా మార్చారు. ఇదే భవనంలో ప్రజాదర్బార్‌ను నిర్వహిస్తోంది. ఇది ప్రజాభవన్‌గా మారిన తరువాత ఇనుప కంచెను తొలగించారు. ఇప్పడు ఈ భవనం భట్టికి అధికారిక నివాసంగా కేటాయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News