Thursday, December 19, 2024

భద్రాచలం వద్ద కరకట్ట పరిసరాలను పరిశీలించిన భట్టి

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి: భద్రాచలం వద్ద కరకట్ట పరిసరాలను సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు పరిశీలించారు. భద్రాచలం కరకట్ట రామాలయం వద్ద స్లూవిస్ ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క మల్లు,
భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య పరిశీలించారు. స్లూవీస్ మోటార్ల పనితీరును భట్టి అడిగి తెలుసుకున్నారు. పాత మోటార్లు, అద్దె మోటార్లతో కాలం వెళ్లదీస్తున్నారని స్థానికులు వాపోయారు. సమయానికి మోటార్లు పనిచేయకపోవడం వలన భద్రాచలంలో ప్రతి ఏడాది వచ్చే గోదావరి వరదలకు రామాలయం, వస్తు దుకాణాలు, పరిసర ప్రాంతాలు మునిగిపోతున్నాయని స్థానికులు తెలిపారు.

కొత్తగూడెం నుండి భద్రాచలం కిన్నెరసాని నది దగ్గర రెండు సంవత్సరాల క్రితమే కట్టిన చెక్ డ్యాం వరద ఉధృతి కి తెగిపోయాని భట్టి విక్రమార్క తెలిపారు. నాణ్యత లేని పనులు చేసి మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్య పెడుతున్న కెసిఆర్ ప్రభుత్వం చేతకానితననికి ఇదే నిదర్శనమన్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడి నాణ్యత లేని పనులు చేసిన అన్ని ప్రాజెక్టుల పైన సమగ్ర దర్యాప్తు చేపడతామన్నారు. ప్రజా ధనాన్ని వృధా చేసిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News