Tuesday, January 21, 2025

విద్యార్థులనూ కెసిఆర్ విభజించారు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/కొందుర్గు : బిఆర్‌ఎస్‌కు 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలుంటే పేద విద్యార్థులు చదివే స్కూళ్లకు గత ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పేద విద్యార్థులు చదువుకునే బడులు, హాస్టళ్లు, గు రుకుల పాఠశాలలను బిఆర్‌ఎస్ పట్టించుకోలేదని, బిఆర్‌ఎస్ మాత్రం 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయా లు నిర్మించుకుందని ఆయన ధ్వజమెత్తారు. వం దల కోట్లు ఖర్చు చేసి ప్రగతిభవన్, ఫాంహౌజ్‌లు క ట్టించుకుందని ఆయన దుయ్యబట్టారు. రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు ఆలోచన మాజీ ప్ర ధాని పివి నరసింహారావుదని సిఎం రేవంత్ పేర్కొన్నారు. శుక్రవారం 28 చోట్ల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాలకు సిఎం రేవంత్‌తో పా టు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజా ప్రతినిధులు శంకుస్థాపనలు చేస్తారు. ఈ స్కూళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించే ఉద్దేశం తో ఒక్కో పాఠశాలను 25 ఎకరాల్లో రూ.150 కో ట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా కొం దుర్గులో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలకు సిఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాప న చేశా రు. ప్రజాప్రతినిధులతో కలిసి సిఎం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ గు రుకులాల్లో చదివిన చాలామంది ఐఏఎస్‌లు, ఐపిఎస్‌లు అయినట్టు ఆయన గుర్తుచేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం 5 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసిందన్నారు. ఈ కారణంగా గ్రామీణ ప్రాంత వి ద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని సిఎం చె ప్పారు. కెసిఆర్ గురుకుల పాఠశాలలకు ఎక్కడా సరైన భవనాలు నిర్మించలేదన్నారు. చదువుకునే విద్యార్థులను సైతం కెసిఆర్ కులాలవారీగా విభజించారు. ఎస్‌సి,ఎస్‌టి, బిసి, మైనారిటీలంటూ వే ర్వేరుగా గురుకులాలు పెట్టారన్నారు. మా ప్రభుత్వం 21వేల మంది టీచర్లకు పదోన్నతులు ఇచ్చి వారిలో విశ్వాసం కల్పించామని పేర్కొన్నారు. కుల, మతాలకు అతీతంగా ముందుకెళుతున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించటం తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. తాము గద్దెనెక్కగానే చర్యలు చేపట్టినట్టు సిఎం తెలిపారు. కులాలకు అతీతంగా అందరూ ఒకే చోట చదువుకోవాలన్న మహోన్నత ఆశయంతో ప్రభుత్వం సమీకృత గురుకులాలకు శ్రీకారం చుట్టినట్టు ముఖ్యమంత్రి వివరించారు.

పేద విద్యార్థులకు మెరుగైన విద్య: డిప్యూటీ సిఎం
ఖమ్మం జిల్లా లక్ష్మీపురం గ్రామంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల జీవితాలను, సమాజాన్ని విద్యా వ్యవస్థ పూర్తిగా మార్చగలదని ఆయన అన్నారు. పేద విద్యార్థులకు సైతం మెరుగైన విద్యను అందించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వ్యవస్థకు శ్రీకారం చుట్టిందని, విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దడమే ఈ సమీకృత విద్యాలయాల ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
నాణ్యమైన విద్యను అందించడానికి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు: మంత్రి శ్రీధర్‌బాబు
పేదలకు నాణ్యమైన విద్య అందించాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను తీసుకొస్తోందని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. దానికోసమే ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను రూ.250 నుంచి రూ.300 కోట్ల ఖర్చుతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలంలో అడవి సోమన్ పల్లి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని మాట్లాడారు.

మాది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు: మంత్రి పొంగులేటి
గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిరిగా తమది మాటలు చెప్పే ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదల ఆకాంక్షలు నెరవేర్చడమే ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం పొన్నెకల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఉన్న అంతరాలను తగ్గించేందుకే ఈ స్కూళ్లను నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఉన్న గురుకులాలన్నీ ప్రైవేటు భవనాల్లోనే ఉన్నాయన్నారు. పేదవారి బతుకులు మార్చేందుకు విద్య, వైద్యం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని ఆయన తెలిపారు.

ప్రైవేటు స్కూళ్లు మూతపడేలా ప్రభుత్వ స్కూళ్లు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
మాజీ సిఎం కెసిఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. గత ప్రభుత్వం హయాంలో కేజీ టూ పిజి ఉచిత విద్య అందిస్తామని చెప్పారని, మరి ఎందుకు అందించలేకపోయారని ఆయన నిలదీశారు. నల్లగొండలో ఇంటిగ్రేటెడ్ సూళ్ల భవనానికి శంకుస్థాపన చేసిన ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటు స్కూళ్లు మూతపడేలా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు.
ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య: మంత్రి కొండా సురేఖ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యనందించగలుగుతామని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఖిలా వరంగల్ మండలం ఉర్సు రంగలీల మైదానం వద్ద ఇంటిగ్రేటెడ్ సూళ్ల భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా మాట్లాడారు.

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందిస్తాం: మంత్రి పొన్నం
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించడానికి ఇంటిగ్రేటెడ్ సూళ్లను ప్రారంభిస్తున్నామని రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఇంకా వివిధ జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News