Saturday, April 5, 2025

మంత్రుల కమిటీ కసరత్తు షురూ

- Advertisement -
- Advertisement -

హెచ్‌సియు వివాదానికి చెక్ పెట్టడానికి
ప్రయత్నాలు ముమ్మరం సచివాలయంలో
డిప్యూటీ సిఎం భట్టి, సిఎస్ శాంతికుమారి
భేటీ నేటి నుంచి జెఎసిలతో సంప్రదింపులు
400 ఎకరాల్లో నిషేధాజ్ఞలు

మన తెలంగాణ/హైదరాబాద్ : కంచ గచ్చిబౌలి భూ ముల వివాదంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. హెచ్‌సీ యూ వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుంటామని ఇప్పటికే ప్ర భుత్వం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై శు క్రవారం సచివాలయంలో మంత్రుల కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సీఎస్ శాంతికుమారి భేటీ అయ్యారు. ఇప్పటికే ముగ్గురు మంత్రులతో ప్రభు త్వం కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో భట్టి, శ్రీధర్ బాబు, పొంగులేటి ఉన్నారు. సీఏస్,రెవెన్యూ , జీహెచ్‌ఎంసీ, అటవీ ,హెచ్‌ఎండీఏ ఇతర ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. శనివారం నుంచి మం త్రుల కమిటీ జేఏసీలతో సంప్రదింపులు జరపనుంది. ఒకటి రెండు రోజుల్లో విద్యార్థి సంఘాలు, పౌర సంఘాలు, పర్యావరణ వేత్తలతో మం త్రుల కమిటీ సమావేశం కానుంది. ఈ నెల 16 వరకు నివేదిక ఇవ్వాలని సీఎస్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో నివేదిక తయారీపై సీఎస్ శాంతికుమారి దృష్టి సారించారు. కంచ గచ్చిబౌలిలో ఎకో పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వ ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News