Wednesday, January 22, 2025

తుమ్మల నాగేశ్వరరావుతో భట్టి విక్రమార్క భేటీ

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలోని తుమ్మల నివాసానికి చేరుకున్న భట్టి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

అయితే 40 ఏళ్లుగా తనకు మద్దతుగా ఉన్న అనుచరులు, మద్దతుదారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తుమ్మల తెలిపారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన రాజకీయ జీవిత లక్ష్యమన్నారు. కాగా, తన ఆహ్వానానికి తుమ్మల నాగేశ్వరరావు భట్టికి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం విక్రమార్క మాట్లాడుతూ… రాష్ట్రంలో నిజాయితీతో కూడిన రాజకీయాల్లో విలువలున్న నాయకులు లేరని, విలువలున్న నాయకులు తుమ్మల నాగేశ్వరరావు అని కొనియాడారు. అలాంటి తుమ్మలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని అన్నారు. భట్టి రాకతో కాంగ్రెస్ శ్రేణులు తుమ్మల ఇంటి వద్దకు చేరుకున్నారు. తుమ్మల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

బీఆర్ఎస్ నుంచి పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డ తుమ్మల పార్టీ మారతారని జోరుగా ప్రచారం సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం 2023 సెప్టెంబర్ 6న తుమ్మల కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని తుమ్మల ఇప్పటికే స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ జాబితా ప్రకటించిన తర్వాత కూడా ఆయన అదే మాటపైనే ఉన్నారు. అయితే ఆయన కాంగ్రెస్‌లో చేరితే ఖమ్మం నుంచి పోటీ చేయాలని ఆ పార్టీ ముఖ్య నేతలు సూచించినట్లు తెలిసింది.

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పొంగులేటి పాలేరు నుంచి పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌గా, తుమ్మ‌ల మాత్రం ఖ‌మ్మం నుంచి పోటీ చేసేందుకు సిద్ద‌మ‌య్యారు. మరోవైపు వైఎస్సార్‌టీపీ కాంగ్రెస్‌లో విలీనమైతే పాలేరు సీటుపై షర్మిల కూడా పట్టుబట్టే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News