Sunday, December 22, 2024

సంయుక్త కార్యాచరణ

- Advertisement -
- Advertisement -

విధానపరమైన నిర్ణయాలతో విభజన
అంశాలు కొలిక్కి ఇరు రాష్ట్రాల
సిఎస్‌ల నేతృత్వంలో కమిటీలు
వేయాలని నిర్ణయించాం గంజాయి,
డ్రగ్స్,సైబర్ క్రైమ్‌లపై ఉమ్మడిగా
ఉక్కుపాదం : భట్టి తాజా పరిణామం
యావత్ తెలుగుజాతి హర్షించే రోజు : ఎపి మంత్రి అనగాని సత్యప్రసాద్

మనతెలంగాణ/హైదరాబాద్ :రెండు రాష్ట్రాల ప్ర యోజనాలు దెబ్బతినకుండా విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయించామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు రాష్ట్రాల విభజన సమస్యలు త్వరితగతి న పరిష్కారం అయ్యేలా రెండు కమిటీలను వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించామని, గత పదేళ్లలో పరిష్కారం కానీ, అంశాలను పరిష్కరించుకోవాలన్న ఉద్ధేశ్యంతోనే ఇరు రాష్ట్రాల సిఎంల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నామని ఆయన తెలిపా రు. ఇరు రాష్ట్రాల సిఎంల సమావేశం అనంతరం ఇరు రాష్ట్రాల మంత్రులతో కలిసి డిప్యూటీ సిఎం భ ట్టి విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో భాగంగా విధానపరమైన నిర్ణయాలతో విభజన అంశాలను పరిష్కరించుకోవాలని నిర్ణయించామన్నారు. అందులో భాగంగానే పలు సమస్యలపై కూలకుషంగా చర్చించామని ఆయన తెలిపారు.

అందులో భాగంగా ఉన్నతస్థాయి అధికారులతో కూడిన కమిటీని (ఇరు రాష్ట్రాల సిఎస్‌లతో) వేయాలని నిర్ణయించామని ఆ కమిటీలో రెండు రాష్ట్రాల నుంచి మరో ముగ్గురు అధికారులు, సభ్యులుగా కూడా ఉంటారని ఆయన తెలిపారు. ఈ కమిటీ వే సిన మూడు వారాల్లో సమావేశమై పలు అంశాల పై చర్చిస్తుందని డిప్యూటీ సిఎం భట్టి తెలిపారు. ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో సమస్యలు పరిష్కారం కాకపోతే ఇరు రాష్ట్రాల మంత్రులతో క మిటీ సమావేశమై ఆ సమస్యలకు మార్గాలను చూ పుతుందన్నారు. అప్పుడు కూడా ఆ సమస్యలు పరిష్కారం కాకపోతే ఇరు రాష్ట్రాల సిఎంలు సమావేశమై పరిష్కారం కానీ సమస్యలకు ఒక దారి చూపాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టుగా డిప్యూటీ సిఎం తెలిపారు. ఈ సమస్యలతో పాటు గంజాయి, డ్రగ్స్ రవాణాలపై ఇరు తెలుగు రాష్ట్రాలు ఉక్కుపాదం మోపాలని నిర్ణయించామని ఆయన తెలిపారు.

దీనికోసం ఇప్పటికే తెలంగాణలో యాంటీ నార్కోటిక్‌ను ఏర్పాటు చేయడంతో పాటు దానికి అడిషనల్ డిజి స్థాయి అధికారిని నియమించామని ఆయన పేర్కొన్నారు. దాంతోపాటు సైబర్ క్రైం వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని దీనికి కూడా పరిష్కారం కనుక్కోవాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. ఈ రెండు సమస్యలు ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని అందులో భాగంగా వీటిపై కూడా కలిసి పోరాడాలని ఇరు రాష్ట్రాల ఒక నిర్ణయం తీసుకున్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే గంజాయి, డ్రగ్స్, సైబర్ క్రైంలకు ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సమావేశంలో నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు.

తెలుగుజాతి హర్షించే రోజు: ఎపి మంత్రి అనగాని సత్యప్రసాద్

ఎపి మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ఎపి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టగానే ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారని ఆయన తెలిపారు. అందులో భాగంగా ఈ సమావేశంలో పాల్గొని ఇరు రాష్ట్రాల అధికారులతో మాట్లాడినట్టు ఆయన పేర్కొన్నారు. తాజా పరిణామాలు తెలుగుజాతి మొత్తం హర్షించే రోజు అన్నారు. ఎపి అభివృద్ధిని కూడా పరిగణలోకి తీసుకొని ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ముందుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. అందులో భాగంగా మంత్రులు, ఉన్నతస్థాయి అధికారుల కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు. ఎపిలో గంజాయి ఎక్కువ ఉత్పత్తి అవుతుందని దానిని తెలంగాణకు రవాణా చేసి ఇక్కడ విక్రయిస్తున్నారని గుర్తించామని, అందులో భాగంగా దానిని అరికట్టడానికి ఇరు రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ఇలా అనేక సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాల సిఎంలు నిర్ణయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News