Saturday, March 29, 2025

ఆరోగ్యశ్రీకి నిధుల కొరత రానివ్వం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : పేద, మధ్యతరగతి వర్గాలు అత్యధికంగా ఆధారపడే వైద్య ఆరో గ్య శాఖకు నిధుల కేటాయింపులో అత్యంత ప్రా ధాన్యత ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అం బేద్కర్ సచివాలయంలో జరిగిన వైద్య, ఆరోగ్యశా ఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రీ బడ్జెట్ సమావేశం లో సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సిం హ అధికారులకు పలు సూచనలు చేశారు. గత దశాబ్ద కాలంగా డ్రగ్స్, ఫుడ్ సేఫ్టీ, మెడికల్ ఎడ్యుకేషన్ విభాగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని మం త్రులు అభిప్రాయపడ్డారు. ప్రజా ప్రభుత్వం లో ఈ మూడు  విభాగాలకు ప్రాధాన్యత ఇచ్చి రాబోయే రోజుల్లో బలోపేతం చేస్తామని తెలిపారు. డ్రగ్స్, ఫుడ్ సేఫ్టీ విభాగాలను ఆధునికీకరిస్తామన్నారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ కి రానున్న బడ్జెట్లో సమృద్ధిగా నిధులు కేటాయించి పేద, మధ్యతరగతి వర్గాలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. రానున్న ఏడాదిలో రాష్ట్రంలో వైద్య కళాశాల భవనాలు, ఆసుపత్రుల నిర్మాణం పనులు పూర్తవుతాయని మంత్రులు తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను పెద్ద సంఖ్యలో వినియోగించుకునేలా అధికారులు కృషి చేయాలని మంత్రులు ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లాంటోరియంలు నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు మంత్రులు తెలిపారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టియాన చొంగతా, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ అహ్మద్ నదీమ్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రెటరీ హరిత తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News