Sunday, December 22, 2024

కులగణనతో మోడీపై యుద్ధభేరి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :కులగణన ను నవంబర్ 31వ తేదీలోగా పూర్తి చేసి భవిష్యత్ యుద్ధానికి సిద్ధం కావాలని, తెలంగాణ నుంచే నరేంద్రమోడీపై యుద్ధం ప్రకటించాలని సిఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కులగణన ఎక్స్ రే మాత్రమే కాదని, ఇది మె గా హెల్త్ చెకప్ లాంటిదని ఆయన తెలిపా రు. పార్టీకి నష్టం చేకూర్చేలా ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే పార్టీ సహించదని, రేవంత్ రెడ్డి చట్టాన్ని అమలు చేస్తాడు తప్ప, వ్యక్తిగత ఎజెండాతో పనిచేయరని, ప్రతిపక్షాల కుట్రలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని సిఎం రేవంత్ సూచించారు. ప్రభుత్వ ఆదాయాన్ని సామాజిక న్యాయం ప్రకారం పంచడమే కాంగ్రెస్ విధానమని ఆయన చె ప్పుకొచ్చారు. రాష్ట్రంలో వచ్చేనెల నుంచి చే పట్టనున్న కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్ లో సమావేశం నిర్వహించింది.

ఈ సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కీలక మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడు తూ భవిష్యత్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో మన మోడల్ ను పరిగణనలోకి తీసుకునేలా మోడల్ డాక్యుమెంట్ ను కేంద్రానికి పంపుతామన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా డిఎస్సీ పూర్తి చేసి ఉద్యోగ నియామక పత్రాలు అందించామని ఆయన తెలిపారు. రాజకీయ మనుగడ కోసంఅడ్డంకులు సృష్టించినా 10నెలల్లో 50 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని ఆయన పేర్కొన్నారు.గ్రూప్ 1 విషయంలోనూ ప్రతిపక్షాలు రకరకాల అపోహ లు సృష్టించి అడ్డుకోవాలని చూశాయన్నా రు. జీఓ ఇచ్చినపుడు, నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, ప్రిలిమ్స్ ఫలితాలు ఇచ్చినపుడు కో ర్టుకు పోలేదని, కానీ, మెయిన్స్ నిర్వహించే సందర్భంలో జీఓ 29పై కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలని చూశారన్నారు. సుప్రీంకోర్టు కూడా ఆ పిటిషన్‌ను కొట్టేసిందని సిఎం రేవంత్ తెలిపారు. కొంతమంది అగ్రవర్ణాల కోసమే గ్రూప్ 1 నిర్వహిస్తున్నా రని, బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని ఒక వాదన తీసుకొచ్చారని ఆయన తెలిపారు. సెలక్ట్ అయిన 31,383 మందిలో 10శాతం లోపు మాత్రమే అగ్రవర్ణాలు ఉన్నారని, 57.11 శాతం బిసిలు,15.38 శాతం ఎస్సీలు, 8.87 శాతం ఎస్టీలు, 8.84 ఈడబ్ల్యూఎస్ కోటాలో సెలక్ట్ అయ్యారని సిఎం తెలిపారు. స్పోర్ట్ కోటాలో 20 మంది సెలక్ట్ అయ్యారని ముఖ్యమంత్రి తెలిపారు.

మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టే వారసులం
గాంధీ కుటుంబం మాట ఇస్తే హరిహరాదులు అడ్డు వచ్చినా అది నెరవేర్చి తీరుతుందని సిఎం రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడుతుందని సామాజిక, ఆర్ధిక రాజకీయ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని, సెప్టెంబర్ 17వ తేదీన తుక్కుగూడ సభలో సోనియాగాంధీ కూడా తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారని, రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు, అడ్డంకులు వచ్చినా ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడంలో సోనియమ్మ సఫలీకృతం అయ్యారని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టడం ఇక్కడున్న ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన సూచించారు. రేవంత్ రెడ్డి రెడ్డినా, మహేష్ గౌడ్ గౌడా అనేది కాదని, మనం మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టే వారసులం కావాలని, రేవంత్ రెడ్డి కి ప్రత్యేక గుర్తింపు ఏమీ లేదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీనే రేవంత్ రెడ్డికి గుర్తింపు ఇచ్చిందని, మీరంతా కష్టపడితేనే నాకు ఈ బాధ్యత వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

గాంధీ కుటుంబం మాట ఇచ్చిందంటే మరో చర్చకు తావు లేదు
గాంధీ కుటుంబం మాట ఇచ్చిందంటే మరో చర్చకు తావు లేదని, చర్చకు అవకాశం ఇచ్చారంటే వారు పార్టీ ద్రోహులేనని సిఎం రేవంత్ తెలిపారు. పార్టీ ఎజెండాతోనే ప్రజల్లోకి వెళ్లామని, పార్టీ విధానాన్ని అమలు చేయడమే మన ప్రభుత్వ విధానమని సిఎం రేవంత్ పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్ ఐడియాలజీతో సంబంధం ఉన్న నిరంజన్‌ను బిసి కమిషన్ చైర్మన్‌గా నియమించుకున్నామని సిఎం తెలిపారు. పని చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నా ప్రతి క్షణం సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ కేడర్, లీడర్‌లపై ఉందని సిఎం పేర్కొన్నారు. కులగణనపై సమన్వయం చేసుకునేందుకు రాష్ట్రంలోని 33 జిల్లాలకు 33 మంది అబ్జర్వర్లను నియమించాలని, బాధ్యతగా పని చేయాలని, మీ కష్టానికి ఫలితం తప్పకుండా ఉంటుందని సిఎం రేవంత్ పేర్కొన్నారు. దేశానికి తెలంగాణ ఒక మోడల్ గా మారాలని, ఆ దిశగా ఈ కార్యక్ర మాన్ని ముందుకు తీసుకెళ్లాలని, తెలంగాణ మోడల్ దేశంలో రాహుల్ గాంధీని ప్రధానిని చేసేలా ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే అందరూ బాధ్యతగా పని చేయాలని, మీ కష్టానికి ఫలితం తప్పకుండా ఉంటుందని, నవంబర్ 31వ తేదీలోగా కులగణన పూర్తి చేసి భవిష్యత్ యుద్ధానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

కులగణనకు తెలంగాణ పరిశోధన కేంద్రం: డిప్యూటీ సిఎం భట్టి
కులగణన ద్వారా సమాజంలో ఎక్స్‌రే నిర్వహించి సమాజానికి చికిత్స చేయాలని రాహుల్ గాంధీ భావించారని ఆ దిశగా అందరూ కృషి చేయాలని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. గాంధీభవన్‌లో జరిగిన కులగణన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా కులగణన నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. కులగణనకు తెలంగాణ పరిశోధన కేంద్రంగా ఒక మోడల్ గా నిలిచి దేశానికి సందేశం ఇవ్వబోతుందని ఆయన అన్నారు. గాంధీ భవన్‌లో నేడు జరుగుతున్న ఈ సమావేశం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటన చేసి అన్ని వర్గాల అభిప్రాయాలను తెలుసుకున్నారని, మోటార్ సైకిల్ మెకానిక్ నుంచి, దళితులు, గిరిజనులతో కలిసి వంట చేసుకుని వారితో తిరిగారని వివిధ అంశాల వారి నుంచి పలు విషయాలను రాహుల్ తెలుసుకున్నారని ఆయన తెలిపారు. ఈ దేశ వనరులు, ఆస్తులు అందరికీ సమానంగా దక్కడం లేదని అంతిమంగా రాహుల్ గుర్తించారని ఆయన వివరించారు. కుల గణన ద్వారా సమస్యలు తెలుసుకొని చికిత్స చేసినప్పుడే భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేసినట్లు అవుతుందని భట్టి అన్నారు.

బిసి, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లకు సంబంధించిన అధికారులను….డిప్యూటీ సిఎం భట్టి
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సిఎం రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ సమావేశమై కులగణన కోసం తీర్మానం చేశామని భట్టి తెలిపారు. శాసనసభలో విస్తృత స్థాయిలో చర్చ పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేయడం ప్రభుత్వం ఘనవిజయంగా ఆయన అభివర్ణించారు. అసెంబ్లీ తీర్మానం ఆధారంగా 10.10.2024న సమగ్ర కులగణనను ప్రణాళిక శాఖ ద్వారా చేపట్టేందుకు జీఓ జారీ చేసినట్లు ఆయన వివరించారు. ఈ సర్వేలో ఏ సమాచారం సేకరించాలి, ఏ ప్రశ్నలు ఉండాలన్నది తెలుసుకోవడం కోసమే కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో విస్తృత సమావేశం ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. పార్టీ శ్రేణులు ఇచ్చే సమాచారం, ప్రశ్నలు తప్పకుండా సర్వేలో పొందుపరుస్తామన్నారు. ఈ సర్వేపై సమాజంలోని అన్ని వర్గాలను భాగస్వాములను చేస్తామన్నారు. బిసి, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లకు సంబంధించిన అధికారులను భాగస్వాములను చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News