ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు రీ సర్వే
టోల్‌ఫ్రీ, ఆన్‌లైన్, నేరుగా మండల
కార్యాలయంలో నమోదు చేసుకునే
అవకాశం మూడు పద్ధతుల్లో
కొనసాగనున్న రీ సర్వే
గతంలో నిర్వహించిన కులగణన
సర్వేలో పాల్గొనని జనాభా 3.1శాతం
వారందరికీ ఇది మంచి అవకాశం
బిసిలకు పెంచిన రిజర్వేషన్లకు
చట్టబద్ధత కల్పిస్తాం అసెంబ్లీలో
తీర్మానం పెట్టి ఆమోదిస్తాం కులగణన
బిల్లు కేంద్రానికి పంపి పార్లమెంట్
ఆమోదానికి కృషి చేస్తాం : డిప్యూటీ
సిఎం భట్టి విక్రమార్క
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరోసారి కు ల గణన సర్వే నిర్వహిస్తామని డిప్యూటీ సిఎం మల్లు భ ట్టి విక్రమార్క ప్రకటించారు. ఫిబ్రవరి 16 నుం చి 28వ తేదీ వరకు ఈ సర్వే నిర్వహిస్తామని వెల్లడించారు. శాసనసభలో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు ఆమోదంతో చట్టబద్ధం చే యాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కులగణన బిల్లును కేంద్ర ప్ర భుత్వానికి పంపి, ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో ఆమోదానికి కృషిచేస్తామని తెలిపా రు. ఒబిసిల రిజర్వేషన్ల కోసం వివిధ పార్టీల నాయకుల అభిప్రాయాలను తీసుకుని, రి జర్వేషన్లపై కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని పోతామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సిఎస్ శాం తికుమారి, ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాలతో కలిసి డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు.
అం తకు ముందు స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సిఎం రేవంత్‌రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో భేటీ అయి చర్చించారు. బిసి కులగణనలపై ఆయా సంఘాలు, నాయకులు వ్య క్తం చేసిన సూచనలు, సలహాలను సిఎం కూలంకషంగా చర్చించారు. అలాగే ఎన్నికల మ్యానిఫెస్టోలో బిసి రిజర్వేషన్లు 42 శాతం కల్పిస్తామని ఇచ్చిన హామీ అమలు అయ్యే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తదనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మీడియాకు వెల్లడించాల్సిన బాధ్యతలను డిప్యూటీ సిఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్‌లకు అప్పగించారు. ఆ మేరకు భట్టి, పొన్నం మీడియా సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ, రాష్ట్రంలో గతం లో నిర్వహించిన సర్వేలో 3.1 శాతం మంది పాల్గొన లేదని, వారి కోసమే మరోసారి సర్వే నిర్వహిస్తున్నట్లు పే ర్కొన్నారు. ఈసారి కుల గణన సర్వే కోసం టోల్ ఫ్రీ నెం బర్, ఆన్‌లైన్‌తో పాటు మండల కార్యాలయాల్లో
ప్రజా పాలన అధికారులు ఈ కలుపుకుని పోతామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సిఎస్ శాంతికుమారి, ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాలతో కలిసి డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్రంలో గతంలో నిర్వహించిన సర్వేలో 3.1 శాతం మంది పాల్గొన లేదని, వారి కోసమే మరోసారి సర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈసారి కుల గణన సర్వే కోసం టోల్ ఫ్రీ నెంబర్, ఆన్‌లైన్‌తో పాటు మండల కార్యాలయాల్లో ప్రజా పాలన అధికారులు ఈ పది రోజులు అందుబాటులో ఉంటారని, అక్కడ వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
ఇప్పటివరకు నమోదు చేసుకొని వారికి మూడు పద్ధతుల్లో అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా ఇంటింటి సర్వేలో వివరాలు వెల్లడించకపోగా, మరికొందరు అందుబాటులో లేకపోవడం వల్ల సర్వేలో పాల్గొనలేదని, వారందరి కోసం మరోసారి అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు. కెసిఆర్, కెటిఆర్ వంటి వాళ్లు ఉద్దేశపూర్వకంగా సర్వేలో పాల్గొనలేదని, ఈసారైనా వారు సర్వేలో పాల్గొనాలని సూచించారు. –ఒబిసిలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, దశాబ్దాల బిసిల కల నిజం చేస్తామని వెల్లడించారు. సర్వే పూర్తయిన తర్వాత మార్చి మొదటి వారంలో కేబినెట్‌లో తీర్మానం పెట్టనున్నట్లు వెల్లడించారు.అనంతరం అసెంబ్లీలో ఒబిసి రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించి, పార్లమెంట్‌లో బిల్లు పెట్టించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. బిసిల దశాబ్దాల కలను నిజం చేసే అంశంలో తమతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీకి ప్రతినిధి బృందం వెళ్లి, ప్రధానితోపాటు అన్ని పార్టీల నేతలను కలిసి బిసి బిల్లును పార్లమెంట్‌లో పెట్టాలని విజ్ఞప్తి చేస్తామని తెలిపారు.
అలాంటి వారే రీ సర్వే కోరుతున్నారు
పార్లమెంట్లో ఒబిసిల రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించేందుకు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలను కూడగడతామని, రాజకీయ శక్తులను ఏకం చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో కుల గణన విజయవంతం అయితే దేశమంతా చేయాల్సి వస్తుందని అనుకునేవారు రీ సర్వే కోరుతున్నారని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. బిసిల దశాబ్దాల కల నెరవేర్చేందుకు రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి..రాజకీయ పక్షాలు,సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాలు, మేధావులు ప్రజా ప్రభుత్వంతో కలిసి రావాలని కోరారు. రాష్ట్రంలో ఒబిసిలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు.
దశాబ్దాల బిసిల కలను నిజం చేస్తామని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా లక్ష మందికి పైగా సిబ్బందితో పూర్తిగా శాస్త్రీయంగా సమగ్ర ఇంటింటి సర్వే రాష్ట్రంలో జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఏ వర్గాల జనాభా ఎంతో శాసనసభలో లెక్కలతో సహా సిఎం రేవంత్ రెడ్డి వివరించారని పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో ఒబిసిలు 56 శాతంగా ఉన్నట్టు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం వల్ల కేంద్రం నుంచి ఫైనాన్స్ కమిషన్ నిధులు రావడం లేదని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్కను విలేకరులు అడుగగా, ప్రజల కోసం కొన్ని నెలల ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు.