Wednesday, December 25, 2024

సర్పంచ్ బిల్లులకు మోక్షం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రూ.10 లక్షలలోపు పెండింగ్‌లో ఉ న్న ప్ర జా ప్రతినిధుల పెండింగ్ బిల్లు లు విడుదలకు ఆలోచన చేస్తున్నామని డిప్యూటీ సీ ఎం భట్టి విక్రమార్క మ ల్లు తెలిపారు. ఈ బిల్లుల పెండింగ్‌కు కారణమైన బీఆర్‌ఎస్ నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఆయన హితవు పలికారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. స ర్పంచ్‌లు, జెడ్పిటిసిలు, ఎంపీటీసీలు వంటి ప్రజా ప్రతినిధులు 2023 డిసెంబర్ 7 నాటికి చేసిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు సుమారు రూ.1,300 కోట్ల వరకు ఉన్నాయని తెలిపారు. వీటిలో రూ.10 లక్షలు లోపు బకాయిల విలువ సుమారు రూ. 400 కోట్ల వరకు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు.

సర్పంచ్‌లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు తానూ గమనించి రూ.10 లక్షల లోపు ఉన్న బకాయిలను త్వరలో విడుదల చేయాలని ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వ పెద్దలు స్థానిక సంస్థల్లో ప్రజా ప్రతినిధులతో పనులు చేయించి బిల్లులు పెండింగ్‌లో పెట్టారని, వారిని వీధుల పాలు చేశారని తెలిపారు. ప్రజా ప్రతినిధుల ఇబ్బందులకు కారణమైన టిఆర్‌ఎస్ నేతలు పెండింగ్ బిల్లుల కోసం రోడ్లపైకి వస్తాం, ధర్నాలు చేస్తామని ప్రకటనలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధుల పెండింగ్ బిల్లుల గురించి బిఆర్‌ఎస్ నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News