Wednesday, January 22, 2025

60 శాతం టికెట్లు ఖరారు అయినా విషయం నాకు తెలియదు: భట్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ నెల 16 నుంచి పాదయాత్ర చేస్తున్నానని సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం భట్టి మీడియాతో మాట్లాడారు. తన పాదయాత్రలో కాంగ్రెస్ ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా పాల్గొంటారని వివరించారు. టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాదయాత్ర వేరే రూట్ అని, తనది వేరే రూట్ అని భట్టి తెలిపారు. 60 శాతం టికెట్లు ఖరారు అయినా విషయం తనకు తెలియదన్నారు. కాంగ్రెస్ టికెట్లకు సంబంధించి ఒక విధానం ఉంటుందని, ఆ విధానం ప్రకారమే టికెట్ల ఎంపిక చేయాల్సి ఉంటుందని వివరించారు.

సిఎల్‌పి నేత భట్టి పాదయాత్ర చేయబోతున్నారని ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు తనని పిలవలేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. నల్లగొండలో కూడా బహిరంగ సభ పెట్టాలని కోరామని, పార్లమెంట్ సమావేశాల దృష్టా శని, ఆదివారాలు పాల్గొంటామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News