Monday, December 23, 2024

ప్రాజెక్టుల నిర్వాహణలో బిఆర్‌ఎస్ విఫలమైందిః భట్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రాజెక్టుల నిర్వాహణలో కూడా బిఆర్‌ఎస్ విఫలమైందని సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. తెలంగాణలో ‘పీపుల్స్ మార్చ్’ పేరుతో భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. బుధవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో భట్టి విక్రమార్క పాదయాత్ర ముగిసింది. దీంతో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోకి భట్టి పాదయాత్ర ఎంటరైంది.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన భట్టి.. బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు రెండు ఒకటేనన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఆత్మవిశ్వాసంతో ఉన్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు.

Also Read: హుజూరాబాద్‌కు ఓ సైకోను ఎమ్మెల్సీగా పెట్టారు: ఈటల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News