Monday, December 23, 2024

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం

- Advertisement -
- Advertisement -

చేవెళ్ల: తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం సీనియర్ నాయకులు సున్నపు వసంతం తెలిపారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన హాత్ సే హాత్ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర వరంగల్ స్టేషన్ ఘనాపూర్‌లో కొనసాగుతుండడంతో బుధవారం చేవెళ్ల కాంగ్రెస్ నాయకులు పాదయాత్రలో పాల్గొన్నారు. ఆకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శిస్తూ ఆయన వెంట నడుస్తూ రైతుల కష్టాలను, సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఆయనకు బాసటగా పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య కూడా పాదయాత్రలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సున్నపు వసంతం మాట్లాడుతూ.. 120 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఎప్పుడూ నిలబడుతుందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రానున్నది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అన్నారు. రైతులను ఆదుకునేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని తెలిపారు. ఆకాల నష్టాలతో పంటలను కోల్పోయిన రైతాంగాన్ని తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆదుకుని పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News