Sunday, December 22, 2024

లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని సిఎల్పీ నేత, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి భట్టి విక్రమార్క మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పూర్ణకుంభంతో ఆలయ పండితులు స్వాగతం పలికారు. అనంతరం ఆశీర్వచనం చేసి అమ్మవారి పసుపు, కుంకుమ, ప్రసాదాన్ని ఆలయ పండితులు భట్టికి అందజేశారు. సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భట్టి విక్రమార్క దంపతులకు ఆలయ వద్ద ఘనంగా స్వాగతం పలికి శాలువా కప్పి సత్కరించారు. ఆలయానికి వచ్చిన భట్టి విక్రమార్కను బందోబస్తు పర్యవేక్షణకు విచ్చేసిన అడిషనల్ డీజి సుధీర్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News