Tuesday, December 24, 2024

విభజన హామీలను నెరవేర్చాలని కోరాం: భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని..ప్రభుత్వపరంగా, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని మోడీని కలిశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రధాని మోడీతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా భట్టీ మాట్లాడుతూ..  “తొలిసారిగా సీఎం, డిప్యూటీ సీఎం హోదాలో ప్రధాని మోడీని కలిశాం. తెలంగాణకు రావాల్సిన గ్రాంట్స్ ను విడుదల చేయాలని కోరాం. విభజన హామీలను నెరవేర్చాలని కోరాం. రాష్ట్రానికి ఆర్థిక సహకారాన్ని అందించాలని కోరాం. ఐటిఐఆర్ ప్రాజెక్టును వెంటనే మంజూరు చేయాలని ప్రధాని మోడీని రిక్వెస్ట్ చేశాం. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసింది. రాష్ట్ర ఆర్థికపరిస్థితిని ప్రధానికి వివరించాం. రాష్ట్రానికి రావాల్సిన రూ.2,200 కోట్ల నిధులను విడుదల చేయాలని కోరాం. తెలంగాణపై కేంద్రం సహాయక, సాహకారాలు ఉండాలని కోరాం. మా విజ్ఞప్తులకు ప్రధాని మోడీ సానుకూలంగా స్పిందించారు” అని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News