హైదరాబాద్: దేశంలో ప్రజాస్వామ్యంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోందని, భావస్వేచ్ఛ, ప్రైవసీ లేకుండా పోతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సామాజిక సేవకుల ఫోన్లను బిజెపి ట్యాప్ చేస్తోందని, ఫోన్ కాల్స్ ట్యాప్ చేస్తుండటంతో ప్రజాస్వామ్యానికి రక్షణ కరవైందని, వ్యక్తుల భద్రతా సమస్యకు ఫోన్ కాల్స్ ట్యాప్ తెరలేపాయని పేర్కొంటూ.. ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్‌షా దేశానికి సమాధానం చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు. ప్రజా స్వామ్యంలో విపక్షనేతలపై నిఘా సరికాదని భట్టి మండిపడ్డారు. రాహుల్‌గాంధీ ఫోన్‌పై నిఘా పెట్టడాన్ని నిరసిస్తూ 22న ఇందిరాపార్కు నుంచి చలో రాజ్‌భవన్ కార్యక్రమానికి ఆయన పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలుగుతోందని భట్టి మండిపడ్డారు. పెగాసెస్ స్పైవేర్‌ను ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతారని భట్టి తెలిపారు.
Bhatti Vikramarka press meet at Assembly Media