Monday, November 25, 2024

తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలి: భట్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో ఫ్యూడల్స్, దేశంలో క్యాప్టలిస్టులు కలిసి తెలంగాణని ఇబ్బంది పెడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శనివారం భట్టి గాంధీ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలి. ప్రజల సంపద ప్రజలకు పంచడానికి కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. ప్రజల అవసరాలే మా అజెండా. ప్రజల ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే ప్రభుత్వాన్ని తెస్తామని మాట ఇస్తున్నాం. సంపద, వనరులు, స్వేచ్ఛ పాలకులకే పరిమితమయ్యాయి. మేం ఏం చేశామో ప్రజలకు తెలుసు. తొమ్మిది ఎండ్లలో ఏదో అద్భుతం జరుగుతున్నట్టు కేసీఆర్ భ్రమ కల్పిస్తున్నారు. తెలంగాణ వనరులను ప్రభుత్వ పెద్దలు దొచేస్తున్నారు. ధరణి అనేది మహమ్మారి లాగా అయింది.

తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. చేనేత కార్మికులు జీఎస్టీ సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువత కాంగ్రెస్ కి పట్టం కట్టాలని చూస్తున్నారు. సింగరేణిని బొంద పెడుతున్న బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని విద్యార్థులు అనుకుంటున్నారు. ధరణితో మా భూములు మాకు కాకుండా చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పూర్తిగా ఫెయిల్ అయింది. భయంభయంగా బతకాల్సిన పరిస్థితి తెలంగాణలో ఉంది. పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ ఎమ్మెల్యేల చేతిలోకి పోయింది. కేసీఆర్ పాలనలో ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరు. తెలంగాణలో స్వేచ్ఛనే లేకుండ పోయింది” అని తీవ్రంగా మండిపడ్డారు.

Also Read: ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ విధానమేంటి?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News