Monday, January 20, 2025

అప్పుచేసి సంపద సృష్టిస్తాం

- Advertisement -
- Advertisement -

తమ ప్రభుత్వం అప్పులు చేసి సంపద సృష్టించి వాటి ద్వారా సంక్షే మ పథకాలను అమలు చేస్తుందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహి ళా సంఘాలకు ఐదేళ్లలో లక్ష కోట్ల వడ్డిలేని రుణాలు అందిస్తామని తెలిపారు. రుణమాఫీకి పూర్తిగా కట్టుబడి ఉన్నామని, ఎవరికీ ఎ లాంటి అనుమానాలు అవసరం లేదని చేశారు. దేశంలో అధికారంలో ఉన్న బిజెపి కులగణన చేపట్టాలని, తద్వారా దేశ సంపద వనరులు పంచబడాలని, పాలనలోనూ అందరినీ భాగస్వాములను చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మేడిగడ్డలో మేట వేసిన ఇసుకను తొలగిస్తేనే మరమ్మతు పనులు ప్రారంభమవుతాయని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. కేంద్ర ఆధారంగానే రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెడతామని పేర్కొన్నారు.

న్యాయ విచారణ కోరి.. ఇప్పుడు ఆందోళన ఎందుకు?
ఇంజినీర్లను కాదని అంతా తానేనని కెసిఆర్ కాళేశ్వరం కడితే కూలిపోయిందని విమర్శించారు. మేడిగడ్డలో మేట వేసిన ఇసుకను తొలగిస్తేనే ప్రాజెక్టు మరమ్మతు పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోలు అంశంపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని చ ర్యకు పెట్టగా నాటి విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి న్యాయవిచారణ జరగాలని పదేపదే కోరడంతో సభానాయకుడు రేవంత్ రెడ్డి అంగీకరించారని తెలిపారు. ఇప్పుతు విచారణ అంటే ఎందుకు ఆం దోళన చెందుతున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రం లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు శ్రమించిన నాయకుల పూర్తి సమాచారం అధిష్టానం వద్ద ఉందని, త్వరలోనే పదవులు పం పిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.

రైతు రుణమాఫికి కట్టుబడే ఉన్నాం
రాష్ట్రంలోని రైతాంగానికి ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ పూర్తిగా కట్టుబడి ఉందని భట్టి పునరుద్ఘాటించారు. రైతు రుణమాఫీ విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు అవసరం లేదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ముందు ఇదే విషయాన్ని స్పష్టం చేశారని గుర్తు చేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు వేయదు అంటూ ప్రతిపక్షం వారు ప్రచారం చేస్తుంటే.. మేం చేసి చూపించాం’ అని అన్నారు. రాబోయే ఐదేళ్లలో స్వయం సహాయక సంఘాలకు లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు అందజేస్తామని డి ప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పునరుద్ధటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News