హైదరాబాద్: HCU భూములపై దుష్ప్రచారం జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై పలువురు మంత్రులతో కలిసి భట్టి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వర్సిటికి సంబంధించిన భూములపై చర్చ జరుగుతోందన్నారు. ఆ భూములను ప్రభుత్వం గుంజుకుంటున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
హెచ్‌సీయూకు సంబంధించి భూములను కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వర్సిటీ విద్యార్థులు అందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజాసంఘాల నేతలతో ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ సూచన మేరకు భూకేటాయింపులకు సంబంధించిన వివరాలను వారికి ఆయన అందజేశారు. అదే విధంగా రద్దు, చదును ప్రక్రియల గురించి వివరించారు. అంతకు ముందు భూముల వివాదంపై సీఎం మంత్రులతో భేటీ అయి చర్చించారు.