Monday, November 18, 2024

ఏకభిప్రాయంతోనే చెరువులు, మూసీ పునరుద్ధరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: అందరి ఆమోదయోగ్యంతోనే చె రువుల పునరుద్ధరణ, మూసీ ప్రక్షాళన చేస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 2014-23 కాలంలోనూ జలవనరులు కబ్జా కోరల్లో చి క్కుకున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. దీనిని సరిచేసే పనిని చే పట్టిన కాంగ్రెస్ సర్కార్‌పై రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు బురదచల్లడం సరికాదని సూచించారు. నిర్వాసితులను ఆదుకునే బా ధ్యత ప్రభుత్వానిదేనన్న భట్టి, విపక్షాలు ఏ సలహాలు ఇచ్చినా స్వీకరించేందుకు సిద్ధమని తెలిపారు. హైడ్రా పనితీరు, చెరువులు పునరుద్ధరణ, మూసీ ప్రక్షాళనపై విపక్షాలు విమర్శలు చేస్తున్న వే ళ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజంటేష న్ ద్వారా పూర్తి వివరాలు వివరించారు. 2014 నుంచి 2023వరకు హైదరాబాద్‌లో చెరువులు ఎలా కబ్జాకు గురయ్యానే వివరాలను అధికారులు తెలిపారు. అనేక చెరువులు పూర్తిగా కబ్జాకు గు రికాగా, మరికొన్ని పాక్షికంగా ఆక్రమణలు గురయ్యాయని తెలిపారు. ఇవన్నీ హైదరాబాద్ ప్రజలు ఆస్తి అని, వీటిని రేపటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

ఇది ప్రజా ప్రభుత్వం, పారదర్శకమైన ప్రభుత్వమన్న భట్టి, ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని చెరువులు ప్రజల ఆస్తి అని, హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పారక్స్ అని వ్యాఖ్యానించారు. ఇవి భాగ్యనగరాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాయని తెలిపారు. నగరంలో గత కొన్నేళ్లుగా చెరువులు మాయం అవుతున్నాయన్న ఆయన, మూసీని ఆధునికీకరించాలని గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయని గుర్తుచేశారు. శాటిలైట్ మ్యాప్‌ల ద్వారా చెరువుల ఆక్రమణలను గుర్తిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర విభజన జరిగే నాటికి ఎన్ని చెరువులు ఉన్నాయి, ఇప్పుడెన్ని ఉన్నాయనే పూర్తి వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. హైడ్రాను తీసుకొచ్చింది ముఖ్యమంత్రి కోసమో, మంత్రుల కోసమో కాదని, చెరువులు అన్యాక్రాంతం కాకుండా కొత్త నిబంధనలు తెచ్చుకున్నామని అన్నారు.
చెరువులను భవిష్యత్ తరాలకు అందించాలని ఉపముఖ్యమంత్రి భట్టి వివరించారు. హైదరాబాద్ పరిరక్షణే తమ లక్ష్యమని, హైడ్రాపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేయాలని పాటుపడుతుంటే, అసత్య ప్రచారాలేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అంటేనే కొండలు, గుట్టలు, చెరువులు, పార్కులు అని అభివర్ణించారు.

అనేక చెరువులు, పార్కులు కబ్జాలకు గురయ్యాయని భట్టి విక్రమార్క వివరించారు. నగరంలో చిన్న వర్షానికే ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయని తెలిపారు. మూసీ ప్రక్షాళన సమాజ శ్రేయస్సు కోసమేనని, మూసీని మణిహారంలా మార్చాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు. మెరుగైన హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్ తరాలకు అందించాలన్నదే తమ అభిమతమని, ఇందులో ప్రజా అజెండా తప్ప వ్యక్తిగత అజెండా లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మూసీ బాధితులను తప్పకుండా ఆదుకుంటామని, తొలగించిన ఇళ్లకు బదులు మరో చోట ఇళ్లు ఇచ్చే బాధ్యత తమదేనని ఉద్ఘాటించారు.ఇప్పటికైనా చెరువుల ఆక్రమణ ఆపాలన్న డిప్యూటీ సీఎం, మూసీలో మంచినీళ్లు లేకుండా డ్రైనేజీగా మార్చేశామని ఆవేదన వ్యక్తంచేశారు. మూసీ సుందరీకరణకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని ప్రతిపక్షాలు అంటున్నాయన్న ఆయన, టెండర్లే పిలవకుండా రూ.లక్షన్నర కోట్లు అవుతుందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ అంశంపై ప్రతిపక్షాలు తమ ఆలోచనలు తమకు తెలియజేయాలని కోరారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఎవరికీ ఇబ్బంది కలిగించమన్న భట్టి, ఇళ్లను తొలగించిన బాధితులకు వేరేచోట ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు. కూలగొట్టిన ఇళ్ల కంటే మెరుగైన ఇళ్లను కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News