Sunday, January 19, 2025

కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులన్నీ పటిష్టంగా ఉన్నాయి: భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసిన నాగార్జునసాగర్, శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులు అనేక వరదలు తట్టుకొని నేటికీ చెక్కుచెదరలేదని సిఎల్ పి నేత మల్లు భట్టి విక్రమార్క్ అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం దనియాలగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ఇంజనీరింగ్ అద్భుతమని, ఇంజనీరింగ్ మార్వెల్ అని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వచ్చి చూడాలని బిఆర్‌ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పిందని ఆచరణలో అందుకు బిన్నంగా కుంగిపడుతుందన్నారు. కాలేశ్వరం డిజైన్ సక్రమంగా లేదని, నిర్మాణం అవకతవకలతో జరుగుతున్నదని కాంగ్రెస్ పార్టీగా ముందే చెప్పిందని,కాంగ్రెస్ చెప్పినట్టుగానే కాలేశ్వరం ప్లానింగ్, డిజైనింగ్, మెయింటెనెన్స్, క్వాలిటీ లోపభూయిష్టంగా ఉందని నేషనల్ సేఫ్టీ డ్యామ్ అథారిటీ నివేదిక ఇవ్వడం నిదర్శనమన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాజెక్టు సరైందని దాన్ని అలాగే కొనసాగిస్తే రాష్ట్రానికి మేలు జరిగి ఉండేదన్నారు. మేడిగడ్డ బ్యారేజీ లో 15 నుంచి 25 మధ్యన పిల్లర్లు కుంగిపోవడం అత్యంత ప్రమాదకరంగా మారి బ్యారేజ్‌పై రాకపోకలు నిలిపివేయాల్సిన పరిస్థితికి బిఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ప్రజలకు తెలియకుండా ఉండాలని దాచిపెట్టిన కుట్రలను కాంగ్రెస్ భగ్నం చేసిందన్నారు. మేడిగడ్డ నిర్మాణ విషయంలో నేషనల్ సేఫ్టీ డ్యామ్ అథారిటీ అధికారులు 20 అంశాలపై వివరాలు కోరగా 11 అంశాలను మాత్రమే ఇచ్చి మిగతా వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దాస్తున్నందని ఆయన ప్రశ్నించారు. సెంట్రల్ విజిలెన్స్ కానీ, దర్యాప్తు సంస్థలతో కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తక్షణమే విచారణ చేయించాలి లేనిపక్షంలో కేంద్రం రాష్ట్రంతో కలిసి పోయినట్లుగా అర్థం చేసుకోవాల్సి వస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News