Sunday, December 22, 2024

బడ్జెట్ లో నిరుద్యోగ భృతి, రుణమాఫీ ఊసేలేదు: భట్టీ విక్రమార్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2023-24పై కాంగ్రెస్ పార్టీ సిఎల్పీ నేత భట్టీ విక్రమార్క మండిపడ్డారు. సోమవారం ఉదయం ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద భట్టీ విక్రమార్క మాట్లాడుతూ.. ”బడ్జెట్ లెక్కలు మరోసారి ప్రజల్ని మభ్యపెట్టేలా ఉన్నాయి. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు బడ్జెట్ లో కేటాయింపులు జరగలేదు. బడ్జెట్ లో నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ ఊసేలేదు.

బలహీనవర్గాలకు చాలా తక్కువ కేటాయింపులు చేశారు.గిరిజన బంధు ఆశించినా నిరాశే ఎదురైంది. బిసి యాక్షన్ ప్లాన్స్ ఏమీ చెప్పలేదు. నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవం.. బడ్జెట్ లో ఎక్కడా కనిపించలేదు.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిగా పక్కనపడేశారు.ఆర్థిక మంత్రి హరీశ్ రావు అంకెలగారిడీతో రంగుల ప్రపంచం చూపించారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News