Monday, January 20, 2025

కావాలనే కూర్చున్నా.. ఎవరికీ తల వంచను: భట్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశామని భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి భట్టి యాదాద్రిని దర్శించుకున్నారు. వేదపండితులు ఆశీర్వాదిస్తుండగా భట్టి చిన్న పీటపై కూర్చోవడంతో దళితులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని నెటిజన్లు, ప్రతిపక్షాలు ట్రోల్ చేశాయి. ఈ సందర్భంగా ఆయన రీకౌంటర్ ఇచ్చారు. పేదలకు ఇళ్ల స్థలాలు పథకాన్ని విజయవంతం చేయాలని ప్రార్థించామని, యాదాద్రిలో కావాలనే చిన్న పీట మీద కూర్చున్నానని, సోషల్ మీడియాలో అర్థం లేకుండా ట్రోల్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని శాసిస్తున్నానని, ఎవరో ఎక్కడో కూర్చోపెడితే అక్కడ కూర్చునే వ్యక్తిని కాదు అని, తానేవరికీ తల వంచను అని, తాను ఆత్మగౌరవంతో జీవించే మనిషినని భట్టి వివరణ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News