Sunday, December 22, 2024

ఇరిగేషన్ ప్రాజెక్టుల నిధుల్లో సగం దుర్వినియోగం: భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా ఇరిగేషన్ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వం ఎటిఎంలా వాడుకుంటుందని సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనగర్జన సభలో పాల్గొని బిఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, పేద ప్రజలను దోచుకుందని రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సోమవారం బిఆర్‌ఎస్ నేతలు రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారు.

దీంతో కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి బిజెపి, బిఆర్‌ఎస్ నేతలకు లేదని భట్టి విక్రమార్క అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో సగం దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు. ఆరోగ్య శ్రీ, ఫీజురియంబర్స్‌మెంట్ పథకాలను మేం హామీ ఇవ్వకున్న అమలు చేశామని భట్టీ చెప్పారు.

Also Read: కష్టకాలంలోనే కాళేశ్వరం విలువ తెలుస్తుంది: సిఎం కెసిఆర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News