Wednesday, January 22, 2025

విద్యుత్ శాఖను అప్పుల్లో ముంచేశారు: భట్టి

- Advertisement -
- Advertisement -

గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ శాఖను అప్పులలో ముంచిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. గత ప్రభుత్వం జరిపిన విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి రూ.59,580 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని ఆయన తెలిపారు. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును శనివారం డిప్యూటీ సీఎం భట్టీ సందర్శించి ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలన చేసి పవర్ ప్లాంట్ పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు.

భద్రాద్రి, యాదాద్రి పవర్ స్టేషన్లు పెడుతున్నామని చెప్పి పెద్ద మొత్తంలో అప్పులు చేశారని, రాష్ట్రాన్ని దారుణమైన పరిస్థితికి తీసుకొచ్చారని భట్టి అన్నారు. తాము క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల వద్దకు వెళ్లి పరిస్థితులను సమీక్షిస్తున్నామని, ప్రస్తుతం ప్రణాళికాబద్ధంగా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News