Monday, January 20, 2025

బిజెపి చెబితే… హడావిడిగా అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు: భట్టి

- Advertisement -
- Advertisement -

బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యే వరకు కెసిఆర్ అసెంబ్లీలో ఉంటే బాగుండేది
బిజెపి నాయకులు చెబితే హడావుడిగా అసెంబ్లీకి వచ్చి..హడావుడిగా బయటకు వెళ్లి కెసిఆర్ ప్రెస్‌మీట్ పెట్టారు
గతంలో దళితబంధు కోసం నిధులు కేటాయించి.. ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు
హైదరాబాద్‌లో ఉద్యోగ వ్యవస్థలు రావడానికి కావాల్సిన ఎకో సిస్టం కోసం నిధులను కేటాయించాం
విలేకరుతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చిట్‌చాట్
మనతెలంగాణ/హైదరాబాద్: గత ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.17,700 కోట్లు దళితబంధుకు కేటాయించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హడావుడి అసెంబ్లీకి వచ్చిన కెసిఆర్ బడ్జెట్ ప్రసంగం పూర్తయ్య వరకు అసెంబ్లీలో ఉండకుండా హడావుడిగా బయటకు వెళ్లి మీడియా పాయింట్ వద్ద ప్రెస్ మీట్ పెడితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం నుంచి హక్కుగా రావాల్సిన నిధుల కోసం బుధవారం అసెంబ్లీలో పెట్టిన చర్చకు కెసిఆర్ వస్తే బాగుండేదని, బడ్జెట్ ప్రసంగం పూర్తిగా వింటే కెసిఆర్‌కు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమయ్యేదని ఆయన తెలిపారు. కెసిఆర్‌కు రెస్ట్ తీసుకోమని ప్రజలు సమయం ఇచ్చారని, కేంద్రంలో ఉన్న బిజెపి నాయకులు చెబితే హడావుడిగా అసెంబ్లీకి వచ్చి హడావుడిగా బయటకు వెళ్లి కెసిఆర్ ప్రెస్‌మీట్ పెట్టినట్టున్నారని డిప్యూటీ సిఎం ఎద్దేవా చేశారు.

దళితుల పట్ల కెసిఆర్ నిర్లక్షంగా వ్యవహారించారు..
గతంలో దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారించిన మాజీ సిఎం కెసిఆర్ ఈ బడ్జెట్‌లో దళిత బంధు గురించి ప్రస్తావించలేదని మాట్లాడటం నవ్వాలా? ఏడ్వాలో? అర్థం కావడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను గత ప్రభుత్వం మాదిరిగా తాము పక్కదారి పట్టించమన్నారు. బ్యాక్ లాగ్ నిధులను కలుపుకొని దళిత, గిరిజనులకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు పెడతామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం సంక్షేమం- అభివృద్ధికి సమభాగంలో నిధులు వెచ్చిస్తూ మేలు కలయికతో ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. హైదరాబాద్ మౌలిక వసతుల కల్పనకు ఎన్నడు లేని విధంగా ఈ బడ్జెట్‌లో పది వేల కోట్ల రూపాయలు కేటాయించామన్నారు.

నగర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాం
నగర అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని అభివృద్ధి చేస్తోందన్నారు. హైదరాబాద్‌లో ఉద్యోగ వ్యవస్థలు రావడానికి కావాల్సిన ఎకో సిస్టంను అభివృద్ధి చేయడానికి కావాల్సిన నిధులను పెట్టుబడిగా పెడుతూ తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మణిహారంగా ఉన్న హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడం ప్రాధాన్యత అంశంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. భవిష్యత్ తరాలకు అవసరమయ్యే హ్యూమన్ రీసోర్స్ తయారీ కోసం హైదరాబాద్‌లో పునాదులు వేస్తున్నామన్నారు.

హైదరాబాద్‌లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం విజీన్‌తో తీసుకున్న మిషన్‌గా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థపై పెద్ద ఎత్తున ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నామన్నారు. అంగన్ వాడీలను మూడో తరగతి వరకు అప్ గ్రేడ్ చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో 4వ తరగతి నుంచి అడ్మిషన్లు తీసుకునేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News