హైదరాబాద్: సంక్షేమ పథకాల కోసం లక్షలాది దరఖాస్తులు వచ్చాయని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. లబ్ధిదారుల వెరిఫికేషన్ కోసం గ్రామసభలు నిర్వహించామని, ఇచ్చిన హామీ మేరకు రేపటి నుంచి పథకాల ప్రారంభిస్తామన్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. పవిత్రమైన గణతంత్ర దినోత్సవం రోజున ఇచ్చిన మాట ప్రకారం నాలుగు పథకాలు ప్రారంభిస్తున్నామన్నారు. మండలానికి ఒక గ్రామం యూనిట్‌గా తీసుకొని నాలుగు పథకాలు అమలు చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి పథకాలు అందిస్తామని, మార్చి వరకు ప్రక్రియ పూర్తి చేస్తామని భట్టి స్పష్టం చేశారు. పథకాల్లో ఎలాంటి సీలింగ్ లేదని, అర్హులందరికీ అందిస్తామన్నారు. ఇండ్లు, రేషన్ కార్డుల కోసం ఎక్కువ దరఖాస్తులు వచ్చాయన్నారు. వ్యవసాయం చేసే ప్రతీ ఒక్కరికి రైతు భరోసా ఇస్తామని భట్టి వివరించారు.
ఆ గ్రామాల్లోనే నాలుగు పథకాలు అమలు చేస్తాం: భట్టి
- Advertisement -
- Advertisement -
- Advertisement -