Sunday, December 22, 2024

త్వరలోనే రైతు రుణమాఫీ: భట్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రుణమాఫీ ఎప్పుడు చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు అడుగుత్నాయని, ప్రజల అభిప్రాయాలు తీసుకొని పథకాలపై విధివిధానాలు రూపొందిస్తున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అన్ని వర్గాలతో మాట్లాడి వచ్చిన రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెడుతామని, త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. బుధవారం భట్టి మీడియాతో మాట్లాడారు. రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమైన విషయమని, రైతు ఆత్మహత్య వెనక ఎవరు ఉన్న ఉపేక్షించమని హెచ్చరించారు. రైతు ఆత్మహత్య ఘటనపై విచారణకు ఆదేశించామని భట్టి వివరించారు. గత ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ చేయడానికి ఐదు సంవత్సరాల సమయం తీసుకుందన్నారు. ప్రజలు కట్టిన ప్రతీ పైసా రాష్ట్రాభివృద్ధికి ఉపయోగిస్తామని, జాబ్ క్యాలెండర్ త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఆరు గ్యారెంటీలు అమలు  చేస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News