దేశవ్యాప్తంగా ఆదివాసీలకు శిక్షణ
తరగతులు నిర్వహిస్తాం 2026
నాటికి 20 వేల మంది సైనికులను
తయారుచేస్తాం ఆదివాసీ
సాధికారత శిక్షణ ముగింపులో
డిప్యూటీ సిఎం భట్టి వెల్లడి
మన తెలంగాణ/నాగార్జునసాగర్ : ఎస్‌సి, ఎస్‌టి సబ్ ప్లాన్ నిధులు ఖర్చులు చేస్తున్నారా లేదా అనే అం శంపై ఇప్పటికే అధికారుల నుంచి నివేదిక కోరామని, ఆ నివేదికలు వచ్చాక పక్కాగా అమలు చేసే బాధ్యతను తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్‌లో ఆదివాసీ సాధికారత శిక్షణ ముగింపు సం దర్భంగా శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పాల్గొన్నా రు.ముందుగా నందికొండ మున్సిపాలిటీ మెయిన్ బ స్టాండ్‌లో వద్ద ఉన్న అంబేద్కర్
విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాజెక్టు హౌస్‌లో ఏర్పాటు చేసిన గిరిజన ఆదివాసీ ప్రజాప్రతినిధుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ..ఇందిరమ్మ రాజ్యం రావడంతోనే రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టి సబ్ ప్లాన్ నిధులు ఖర్చు చేసుకోగలిగామని, ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించాలని కోరారు.
ఆదివాసీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో చట్టాలు తెచ్చిందని, వాటిని అమలు చేయించుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని తెలిపారు. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ హయాంలో హక్కులతో పాటు తమ స్వేచ్ఛను కోల్పోయామని అన్నారు. అందువల్లనే రాష్ట్ర ప్రజలు కోరి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని అన్నారు. ఇపుడు మీరే ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలన్నారు. గత ప్రభుత్వం ఇండ్ల పంపిణీని బంద్ చేసిందని, కానీ తాము మళ్లీ ప్రారంభిస్తున్నామన్నారు. అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇస్తామని, ఎస్‌సి, ఎస్‌టిలకు అదనంగా మరో ఒక రూ.లక్ష ఇవ్వబోతున్నామని అన్నారు. గిరిజన, ఆదివాసీలు అడవులను తమ తల్లిగా భావిస్తూ జీవనం సాగిస్తున్నారు. వలస పాలకులు, గిరిజనులపై ప్రేమలేని వ్యక్తులు అడవుల నుంచి గిరిజనులకు దూరం చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గిరిజనుల కోసం తెచ్చి చట్టాలను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి అనేక శిక్షణ తరగతులను నిర్వహిస్తూ 2026 నాటికి 20 వేల మంది సైనికులను తయారుచేస్తామన్నారు.
బడ్జెట్‌లో ఎస్‌సి, ఎస్‌టి జనాభాకు అనుగుణంగా పది శాతానికి తగ్గకుండా నిధులు, కేటాయింపులు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి తండాలలో, పంచాయతీ భవనం, స్కూల్ బిల్డింగ్, అంగన్వాడీ కేంద్రాలను నిర్మిస్తామన్నారు. వైద్య సదుపాయానికి, సామాజిక న్యాయానికి తమ పార్టీ కృషిచేస్తోందని అన్నారు. రాష్ట్రంలోని పేదలందరికీ రేషన్‌కార్డులు ఇవ్వబోతున్నామని అన్నారు. వచ్చే నెల నుంచి లబ్ధిదారులకు సన్నబియ్యం ఇస్తామన్నారు. 2029లో కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌లో ఎస్‌సిలు, గిరిజనులకు సముచిత స్థానం ఉంటుందన్నారు. బడుగు, బలమీన వర్గాల హక్కుల కోసం దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎలు, కుందూరు జయవీర్‌రెడ్డి, బాలునాయక్, బిఎల్‌ఆర్, మాజీ జెడ్‌పిటిసి కర్ణాటక లింగారెడ్డి, అనుముల మార్కెట్ యార్డు ఛైర్మన్ తుమ్మలపల్లి శేఖర్‌రెడ్డి, ట్రైకార్ ఛైర్మన్ బెల్లయ్య నాయక్, నాయకులు కొప్పుల రాజు, శంకర్‌నాయక్, నందికొండ మున్సిపల్ ఛైర్మన్ తిరుమల కొండ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.