Monday, December 23, 2024

రైతు ఆత్మహత్య బాధాకరం

- Advertisement -
- Advertisement -

పుట్టింది బతకడానికి చావడానికి కాదు
నిష్పాక్షికంగా విచారణ.. బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు
అంతా నా వాళ్లే.. రాజకీయాలకు స్థానం లేదు
రైతు ప్రభాకర్ కుటుంబానికి న్యాయం చేస్తాం…అన్ని విధాల ఆదుకుంటాం
మీడియాతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

మన తెలంగాణ / హైదరాబాద్ : చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన చేపల సొసైటీ, ఇరిగేషన్ కు సంబంధించి తన భూమి, వేసినటువంటి మెరకను తొలగించారని రైతు ప్రభాకర్ మనస్థాపన చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు మీడియా ద్వారా మిగతా వారిద్వారా తెలిసింది. రైతు తండ్రి తో, వారి శ్రీమతితో పిల్లలతో మాట్లాడాను. జరిగిన సంఘటన చాలా బాధాకరం. ప్రాణం చాలా విలువైనది. మనం పుట్టింది బతకడానికి కానీ చావడానికి కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన రైతు ప్రభాకర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఎంత పెద్ద సమస్య ఉన్న ఎక్కడో ఒకచోట పరిష్కారం మార్గం వెతుకొని బతకడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేస్తున్నాన్నారు. రైతును ఆత్మహత్యకు పురిగొల్పి దానికి దారి తీసిన పరిస్థితులు కల్పించిన వ్యక్తులు ఎవరైనా సరే, ఎంత పెద్ద వారైనా సరే నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధ్యులైన వారిపై చట్టపరంగా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించానని తెలిపారు. ఇక్కడ అందరూ మా వాళ్లే.. అందరూ నా వాళ్లే. జరిగిన పొరపాటుకు ఎవరూ కారణమైన సరే ఎవరిని ఉపేక్షించేది లేదు, ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు. బాధిత కుటుంబానికి తప్పనిసరిగా న్యాయం జరిగేటట్టుగా ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా రైతు ప్రభాకర్ భూమికి సంబంధించిన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం అన్నారు.

చేపల సొసైటీ, ఇరిగేషన్, రెవెన్యూ వారితో మాట్లాడి సమస్య ఏంటో తెలుసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్‌ను ఆదేశించానన్నారు. పిల్లలు చదువుకోవడానికి అవసరమైన సహాయ సహకారాలు పూర్తిగా ఏర్పాటు చేస్తానని, పిల్లలు బాగా చదువుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. వారు చదువుకున్నంత కాలం చదివిస్తాను ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. ఇతరత్రా సమస్యలకు సంబంధించి కుటుంబ సభ్యులు రాసి ఇచ్చారు వాటిని పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని, ఎలాంటి ఇబ్బంది లేదు అన్నారు. ఇక్కడ అందరూ మావాళ్లే.. ఇటువంటి కేసుల్లో అసలు పార్టీలకు సంబంధమే లేదు…స్థానం లేదు ఇది మానవత్వంతో అందరూ చూడాల్సిన సంఘటన. ఏ పార్టీ వారైనా మనిషే..మనిషి ప్రాణం విలువైనది అని పేర్కొన్నారు. ఈ సంఘటనలో ఎవరిని ఉపేక్షించేది లేదని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News