Tuesday, November 26, 2024

సమిష్టిగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం: భట్టి

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీలో అందరం సమిష్టిగా పనిచేసి తెలంగాణను అభివృద్ధి చేస్తామని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు(గురువారం) మధ్యాహ్నం 1.04గంటల ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డితోపాటు 10మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మరికాసేపట్లో గెలిచిన ఎమ్మెల్యేలందరూ ఎల్లా హోటల్ లో నుంచి ఎల్బీస్టేడియంకు బయల్దేరి వెళ్లనున్నారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందిని… ప్రజల కష్టాలు తీరబోతున్నాయని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా తాను పాదయాత్ర చేశానని.. ప్రజల కష్టాలు దగ్గరగా చూశానని చెప్పారు. గత పదేళ్లలో అధికార బీఆర్ఎస్ ప్రజలను నిర్లక్ష్యం చేసిందని, రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడిందని భట్టి విక్రమార్క ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News