Thursday, December 26, 2024

తమ్మినేని వీరభద్రంను పరామర్శించిన మంత్రులు..

- Advertisement -
- Advertisement -

ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టీ విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డిలు పరామర్శించారు. గురువారం ఆస్పత్రికి వెళ్లి తమ్మినేనిని పరామర్శించిన అనంతరం ఆయన ఆరోగ్యపరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.

Bhatti Vikramarka Visit Tammineni Veerabhadram

ప్రస్తుతం తమ్మినేని ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. ఆయన గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. ఇటీవల ఖమ్మంలోని తన నివాసంలో ఉండగా గుండెపోటు రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. వెంటనే చికిత్స అందించిన వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని.. రెండు రోజులు గడిస్తే గానీ చెప్పలేమన్నారు. ప్రస్తుతం ఆయన ఎలాంటి ప్రాణపాయం లేదని.. కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News