Tuesday, December 17, 2024

వాళ్లు అప్పులు చేస్తే మేము వడ్డీలు కడుతున్నాం: భట్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు గత ప్రభుత్వ లోపాలు చూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా శాసన సభలో భట్టి విక్రమార్క ప్రసంగించారు. తప్పులు కప్పిపుచ్చుకోవడానికి బిఆర్‌ఎస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సభ చర్చను తప్పు దారి పట్టిస్తున్నారని, గతంలో ఇదే సభలో డబుల్ బెడ్ రూం ఇల్లులు ఇస్తామని అన్నారని, సభలో కీలకమైన చర్చలు జరిగేటప్పుడు భంగం కలిగిస్తున్నారని భట్టి దుయ్యబట్టారు.

ప్రివిలేజ్ గురించి బిఆర్‌ఎస్ వాళ్లు మాకు చెప్పే హక్కులేదని, సభా నియమాలకు వ్యతిరేకంగా బిఆర్‌ఎస్ నాయకులు ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. రూ. లక్షల కోట్ల అప్పు తాము చేయలేదని, ఇప్పటి వరకు రూ.52 వేల కోట్లు అప్పులు మాత్రమే తాము తీసుకున్నామని, గత ప్రభుత్వం చేసిన అప్పులకు తాము వడ్డీలకు కడుతున్నామని, సివిల్ సప్లై బిల్లులు కూడా రూ.62 వేల కోట్లు అప్పు చేసి పెట్టామన్నారు. ప్రస్తుతం రైతులు పండించిన ప్రతి పంటను కొంటున్నామని తెలియజేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 40 వేట కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టిపోయారని భట్టి చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News