Friday, March 21, 2025

వారి గురించి సరైన భాష వాడాలి: భట్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సభా నాయకుడిని పట్టుకొని అజ్ఞానం అని మాట్లాడడం సరికాదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హితువు పలికారు. కాంగ్రెస్ వారికి బుద్ధిమాంద్యం ఉందని మాట్లాడడం సరికాదని, విజ్ఞులైతే స్పీకర్ చెప్పింది విని ఉపసంహరించుకోవాలని  డిమాండ్ చేశారు. బడ్జెట్‌పై శాసన సభలో సాధారణ చర్చ సందర్భంగా హరీష్ రావుకు భట్టి కౌంటర్ ఇచ్చారు. ‘సభాపతితో కూడా వాగ్వాదం చేయడం సరికాదు, మాకు బుద్ధి ఉందో మీకు ఉందో లెక్కలు వేసుకుని చెబుతాం, సభా నాయకుడు, ప్రభుత్వ పెద్దల గురించి సరైన భాష వాడాలి’ అని సూచించారు. బడ్జెట్ పరిది దాటి అడ్డగోలుగా మాట్లాడడం సబబుకాదని భట్టి హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News