హైదరాబాద్: ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి బోనాల పండుగ ఇది అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. భాగ్యనగర ప్రజలకు భట్టి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆయన పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని దర్శనం చేసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బోనాల ఉత్సవాలకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని వివరించారు. బోనాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేల కోట్లు నిధులు కేటాయించిందన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి తాజా బడ్జెట్‌లో పది వేల కోట్ల రూపాయలు కేటాయించామని భట్టి తెలియజేశారు. తెలంగాణలో వారసత్వ సంపదను కాంగ్రెస్ ప్రభుత్వం పరిరక్షిస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు సామరస్యంగా నివసిస్తున్న నగరం హైదరాబాద్ అని కొనియాడారు. హైదరాబాద్ ను అత్యంత సెఫ్టీ నగరంగా తీర్చిదిద్దుతామని భట్టి స్పష్టం చేశారు.
ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు: భట్టి
- Advertisement -
- Advertisement -
- Advertisement -