పారాలింపిక్స్‌లో భారత్‌కు రెండు రజతాలు, ఒక కాంస్యం
టేబుల్ టెన్నిస్, హైజంప్, డిస్కస్ త్రోలో రాణించిన క్రీడాకారులు
రాష్ట్రపతి, ప్రధాని సహా ఆటగాళ్లను అభినందిస్తూ ప్రముఖుల ట్వీట్
టోక్యో: టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు అద్భుతంగా రాణిస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్ చైనా క్రీడాకారిణి యింగ్ జావోతో జరిగిన తుదిపోరులో 0-3 తేడాతో ఓడి రజతం కైవసం చేసుకోగా, పురుషుల హైజంప్ పోటీల్లో భారత అథ్లెట్ నిషాద్‌కుమార్ 2.06 మీటర్ల ఎత్తు దూకి రజతం సాధించాడు. డిస్కస్‌త్రో విభాగంలో మరో అథ్లెట్ వినోద్ కుమార్ 19.91 మీటర్ల దూ రం డిస్కస్ త్రో చేసి కాంస్యం దక్కించుకున్నాడు. దీంతో పారాలింపిక్స్‌లో భారత్‌కు ఒకే రోజు మూడు పతకాలు దక్కాయి.
భళా.. భవీనా బెన్
టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్ రజత పతకం సాధించింది. చైనా క్రీడాకారిణి, ప్రపంచ నెంబర్ వన్ సీడ్ యింగ్ జావోతో జరిగిన తుదిపోరులో 0-3 తేడాతో ఓ టమి చెందింది. దీంతో సిల్వర్ మెడల్‌తో దేశానికి తిరిగి రానుంది. అయితే పారాలింపిక్స్ చరిత్రలో టేబుల్ టెన్ని స్‌లో భారత్‌కు పతకం దక్కడం ఇదే తొలిసారి.
చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం
గుజరాత్‌లోని మెహసానాకు భవీనా బెన్ పటేల్ అయిదేళ్ల కిందటే 2016 రియో పారాలింపిక్స్‌కు ఎంపికైంది. కానీ సాంకేతిక కారణాలతో పోటీల్లో పాల్గొనలేదు. అయినా పట్టుదల వీడకుండా టోక్యోలో అడుగుపెట్టింది. తొలి మ్యా చ్‌లోనే ఓటమి ఎదురైనా తన ఆత్మవిశ్వాసాన్ని చెక్కుచెదరలేదు. కుటుంబంలో జన్మించిన భవీనా పోలియో కారణంగా బాల్యంలోనే చక్రాల కుర్చీకి పరిమితమైంది. తన స్నేహితులంతా గెంతులేస్తూ ఆడుతుంటే తాను మాత్రం నడవలేకపోతున్నానని బాధ పడేది. ఆ సమయంలో కుటుంబం తనకు అండగా నిలిచింది. భవీనా తండ్రి 2004లో ఆమెను అహ్మదాబాద్‌లోని బ్లైండ్ పీపుల్స్ అసోసియేషన్‌లో చేర్పించాడు.
అక్కడే ఆమె టేబుల్ టెన్నిస్ కెరీర్‌కు అంకురార్పణ జరిగింది. ఫిట్‌నెస్ కోసం సరదాగా ఆడడం మొదలెట్టి ఆటపై ప్రేమ పెంచుకుంది. మూడేళ్ల పాటు తీవ్రంగా కష్టపడి జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. మొత్తం మీద పారాలింపిక్స్‌లో పతకం గెలిచిన రెండో భారత మహిళా అథ్లెట్‌గా రికార్డు నమోదు చేసింది. పతకమే లక్షంగా ఈసారి బరిలో నిలిచిన భవీనా క్వార్టర్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాంకోవిచ్ (సెర్బియా), ప్రిక్వార్టర్స్‌లో తొమ్మిదో ర్యాంకర్ ఒలివెరా (బ్రెజిల్) ను ఇంటిముఖం పట్టించింది. ఇక సెమీఫైనల్‌లో మూడో ర్యాంకర్ మియావో జంగ్ (చైనా)పై విజయం సాధిం చింది. ఇందులో మియావో జంగ్‌పై గతంలో 11సార్లు తలపడిన భవీనా ఒక్కసారి కూడా గెలవకపోవడం గమనా ర్హం. అయితే ఒత్తిడి తట్టుకొని గెలిచిన భవీనా ఫైనల్ పోరుకు అర్హత సాధించింది.
లోపాలు సరిదిద్దుకుంటా..
నా ప్రదర్శనపై కొద్దిగా నిరాశతో ఉన్నా. ఈరోజు స్థాయి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయా. కానీ, వచ్చే టోర్నమెంట్‌లో ఈ లోపాలను సరిదిద్దుకుంటా. ఏ అథ్లెట్ అయినా వంద శాతం ప్రదర్శన ఇస్తే ఓడిపోరు అని నేను నమ్ముతా. నాకు ఎదురయ్యే సమస్యలతో నేనెప్పుడూ కుంగిపోను. ఎందుకంటే ఒక దారి మూసుకుపోతే భగవంతుడు మరిన్ని అవకాశాలు ఇస్తాడని నమ్ముతా. పారాలింపిక్స్ నుంచి చాలా నేర్చుకున్నా. ఇది గొప్ప అనుభూతి. వచ్చే పారాలింపిక్స్‌లో కచ్చితంగా వంద శాతం మెరుగైన ప్రదర్శన ఇస్తా. ఆసియా గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి. భారత్‌కు చేరుకోగానే సాధన ప్రారంభిస్తా. పారాలింపిక్స్‌లో పొందిన అనుభవాలను భవిష్యత్తులో పాల్గొనే ప్రధాన టోర్నమెంట్‌లలో నా తప్పులను సరిదిద్దుకోవడానికి ఉపయోగిస్తా.
– భవీనా పటేల్
సచినే స్ఫూర్తి..
జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనా బెన్ పటేల్ చేరుకున్నాక తన ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెం డూల్కర్‌ను పేర్కొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ సచిన్ తన సుదీర్ఘ కెరీర్‌లో సాధించిన విజయాల నుంచి తాను ఎంతో స్ఫూర్తి పొందినట్లు తెలిపింది. అతడిని కలిసి తన మెడల్ చూపిస్తానని చెప్పింది. నేను ఎప్పుడూ సచిన్ నుంచి ప్రేరణ పొందాను. అతన్ని నేరుగా కలవాలని అనుకుంటున్నాను. అతడు చెప్పే మోటివేషనల్ స్పీచ్‌లను వింటే నా ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది అని పేర్కొంది. కాగా, భవీనాబెన్ పటేల్ విజయం పై సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు. ‘ఇది చారిత్రాత్మక విజయం’ అంటూ భవీనాబెన్‌ను అభినందించాడు.
గుజరాత్ సిఎం భారీ నజరానా..
టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో అద్భుత కనబర్చి టేబుల్ టెన్నిస్‌లో రజత పతకం సాధించిన భవీనాబెన్ పటేల్‌కు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ భారీ నజరానా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని దివ్యాంగ్ ఖేల్ ప్రతిభా ప్రోత్సాహన్ పురస్కార్ యోజన కింద రూ.3 కోట్లు నజరానాగా అందజేయనున్నట్లు తెలిపారు. మరోవైపు భవానీ స్వస్థలమైన మెహసానా పట్టణంలో సంబురాలు అంబరాన్నంటాయి. కుటుంబసభ్యులు, స్నేహితులంతా ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. పటాకులు కాల్చారు. అనంతరం గుజరాతీ సంప్రదాయ నృత్యమైన గార్బా డ్యాన్స్‌తో అలరించారు.
పదేళ్ల పాటు కదల్లేని స్థితిలో ఉన్నా..
పారాలింపిక్స్‌లో ఆదివారం జరిగిన ఎఫ్52 ఈవెంట్‌లో 19.91మీటర్లు విసిరిన భారత క్రీడాకారుడు వినోద్‌కుమార్ స్థానంలో నిలిచాడు. దీంతో కాంస్య పతకమే కాకుండా ఆసియా రికార్డు సృష్టించాడు. ఈ ఈవెంట్‌లో మొదటి స్థానంలో పోలాండ్ ప్లేయర్ పియోటర్ కొసెవిజ్ (20.02 క్రొయేషియన్ అథ్లెట్ వెలిమిర్ శాండూర్ (19.98మీటర్ల)తో రెండో స్థానంలో దక్కించుకున్నాడు. ఆర్మీ కుటుంబానికి చెందిన వినోద్ కుమార్ తండ్రి 1971 యుద్ధంలో పాల్గొన్నారు. వినోద్ కూడా చదువు ముగించుకొని బిఎస్‌ఎఫ్‌లో చేరాలని భావించాడు. 2002 ట్రైనింగ్ పీరియడ్‌లో భాగంగా లేహ్‌లో ఓ పర్వతంపై నుంచి కిందపడిపోవడంతో కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పదేళ్ల ఏళ్ల పాటు కదలలేని స్థితిలోనే ఉండిపోయాడు. దురదృష్టవశాత్తూ అదే సమయంలోనే తల్లిదండ్రులను కూడా కోల్పోయాడు. 2016లో పారా స్పోర్ట్స్ ఉంటుందని తెలుసుకున్నాడు. రోహ్‌తక్‌లో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు వెళ్లి కలుసుకున్నాడు. ట్రైనింగ్ స్టార్ట్ చేసి లోకల్ కోచ్‌లతో ప్రయాణం మొదలుపెట్టి నేడు దేశానికి కాంస్య పతకం అందించాడు.
సత్తాచాటిన
నిషాద్ కుమార్
పారాలింపిక్స్‌లో పురుషుల హైజంప్ టి47 పోటీల్లో భారత అథ్లెట్ నిషాద్ కుమార్ 2.06 మీటర్ల ఎత్తు దూకి రజతం సాధించాడు. తొలి ప్య్త్న్రంలో ఫెయిల్ అయినా, రెండోసారి పట్టువిడవకుండా సాధించాడు.
భవీనాబెన్‌కు రాష్ట్రపతి, ప్రధాని అభినందన
పారాలింపిక్స్‌లో రజతం సాధించి భారత బృందానికి, క్రీడా ప్రేమికులకు భవీనా స్ఫూర్తినిస్తోంది. ఆమె అసాధా రణమైన సంకల్పం, నైపుణ్యాలు దేశా నికి కీర్తిని తెచ్చిపెట్టాయి. ఈ అసామా న్యమైన విజయం సాధించిన భవీనా కు అభినందనలు.
– రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి
భవీనా పటేల్‌కు అభినందనలు. ఎప్ప టికీ గుర్తుండిపోయే విధంగా చరిత్ర లిఖించావ్. దేశానికి చరిత్రాత్మ క రజత పతకం తీసుకొస్తున్నావు. నీ జీవిత ప్రయాణం ఇతరులకు ప్రేరణ గా నిలవడమే కాకుండా యువతను క్రీడల వైపు ఆకర్షితులను చేస్తుంది.
– నరేంద్ర మోదీ, ప్రధాని