మాచో హీరో గోపీచంద్ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భీమా. ఈ సినిమాకి ఎ.హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్ పతాకంపై కెకె రాధామోహన్ భారీగా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్‌గా నటించారు. శుక్రవారం మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో హీరో గోపీచంద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పిన విశేషాలు..
కమర్షియల్ ప్యాక్డ్ మూవీ..: దర్శకుడు హర్ష చెప్పిన కథ, భీమా క్యారెక్టరైజేషన్ చాలా నచ్చింది. కథలోని సెమీ ఫాంటసీ ఎలిమెంట్ కూడా చాలా నచ్చింది. అలా భీమా సినిమా మొదలైంది. రాక్షసుడిని చంపాలంటే బ్రహ్మరాక్షసుడు రావాలని ‘భీమా’ ని బ్రహ్మరాక్షసుడు అన్నారు. ఇది కమర్షియల్ ప్యాక్డ్ మూవీ. భీమా పాత్రలో ప్రేమ, ఎమోషన్స్, రోమాన్స్… ఇలా అన్ని ఎలిమెంట్స్ వున్నాయి. సినిమా చూసి బయటికి వచ్చాక భీమా ప్రేక్షకుడి మనసులో నిలబడిపోతాడనే నమ్మకం వుంది.
పూర్తి వైవిధ్యమైన పాత్ర..: గోలీమార్ సినిమాలో డిఫరెంట్ కాప్‌గా కనిపించాను. ‘ఆంధ్రుడు’ లవ్ స్టొరీ మీద నడుస్తుంది కానీ దాని నేపధ్యం పోలీసు కథే. శౌర్యం మూవీ కూడా భిన్నమైన కథ. ఈ మూడు చిత్రాలకు పూర్తి వైవిధ్యమైన పాత్ర భీమా. ఇలాంటి పోలీసు కథలో సెమీ ఫాంటసీ ఎలిమెంట్ చాలా కొత్తగా వుంటుంది. అదే నాకు చాలా ఆసక్తిని కలిగించింది. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం వుంది.
సినిమాను చాలా అద్భుతంగా తీశాడు…: హర్ష చాలా అనుభవం వున్న దర్శకుడు. సినిమాను చాలా అద్భుతంగా తీశాడు. చాలా ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే చేశాడు. చాలా గ్రిప్పింగ్‌గా వుంటుంది. ఇందులో హీరో క్యారెక్టర్ పేరు భీమా. ఈ కథకు అదే పేరు సరిపోతుందని సినిమాకు టైటిల్‌గా పెట్టడం జరిగింది.
కథకు కావాల్సిన పాత్రలు అవి…: హీరోయిన్లు ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మల పాత్రలు సినిమాలో చాలా కీలకంగా వుంటాయి. కథకు కావాల్సిన పాత్రలు ఇవి. ఇక సంగీత దర్శకుడు రవిబస్రూర్ మంచి మ్యూజిక్ ఇవ్వాలని అంకితభావంతో పని చేశాడు. ట్రైలర్‌లో మ్యూజిక్ అద్భుతంగా వుంది. దానికి మించి సినిమాలో వుంటుంది.
అలా కలిసొచ్చింది…: నిర్మాత రాధమోహన్ సినిమాని చాలా గ్రాండ్‌గా నిర్మించారు. ఇక సినిమాలో శివుని నేపధ్యం వుంది. సినిమా మహా శివరాత్రికి రావాలని ప్లాన్ చేయలేదు… అలా కలిసొచ్చింది. శివుని ఆజ్ఞ అనుకుంటాను.
ప్రభాస్‌తో తప్పకుండా సినిమా చేస్తా..: ప్రభాస్, నేను కలిసి సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. దానికి ఎప్పుడు టైం వస్తుందో తెలియదు. కానీ తప్పకుండా సినిమా చేస్తాం. ఇక దర్శకుడు శ్రీను వైట్లతో చేస్తున్న సినిమా 30 శాతం పూర్తయింది. తర్వాత ప్రసాద్‌తో ఒక సినిమా వుంటుంది. రాధతో ఒక కథ వర్క్ జరుగుతోంది. అది యూవీ క్రియేషన్స్‌లో వుంటుంది.