Monday, December 23, 2024

మంచి సందేశం ఉన్న సినిమా

- Advertisement -
- Advertisement -

ఎబి సినిమాస్ అండ్ నిహాల్ ప్రొడక్షన్స్ పతాకంపై అంజి వల్గుమాన్, రా జవ్వ, సుధాకర్ రెడ్డి, డా.కీర్తి లత గౌడ్, అభిరామ్,రూప శ్రీనివాస్, సాయి ప్రసన్న నటీ నటులుగా రమేష్ చెప్పాల దర్శకత్వంలో డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లిలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’. ప్రఖ్యాత రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్, సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, నాయకులు అద్దంకి దయాకర్ ఈ సినిమాలో నటించడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్‌ను మంత్రి కెటిఆర్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ‘భీమదేవరపల్లి బ్రాంచి’ చిత్ర టీజర్ చాలా బాగుంది. అలాగే మంచి సందేశం ఉన్న సినిమా ఇది”అని అన్నారు. చిత్ర నిర్మాత డాక్టర్ బత్తిని కీర్తీ లత గౌడ్ మాట్లాడుతూ దర్శకుడు రమేష్ చెప్పాల మంచి విషయాన్ని కామెడీగా చె ప్పడం వల్ల ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News